‘అచ్చేదిన్‌ అంటే ఆకలి భారతాన్ని సృష్టించడమేనా?’

ABN , First Publish Date - 2021-10-17T04:48:53+05:30 IST

అచ్చేదిన్‌ అంటే ఆకలి భారతాన్ని సృష్టించడమేనా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

‘అచ్చేదిన్‌ అంటే ఆకలి భారతాన్ని సృష్టించడమేనా?’

వేంపల్లె, అక్టోబరు 16: అచ్చేదిన్‌ అంటే ఆకలి భారతాన్ని సృష్టించడమేనా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఆయన వేంపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ఆకలి సూచికలో 2021లో 116 దేశాల్లో భారత దేశానికి 101వ ర్యాంకు రావడం బాధాకరమన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉండడం శోచనీయమన్నారు.

మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మయన్మార్‌ మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 67 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.45లక్షలకోట్లు కాగా కేవలం ఏడున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.75 లక్షలకోట్లు అప్పు చేసి అప్పుల భారంగా మార్చిందన్నారు.

అబ్దుల్‌ కలాం దార్శనికుడు, స్పూర్తిప్రదాత

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌కలాం దార్శనికుడు, స్పూర్తిప్రదాత, మార్గదర్శి, స్థితప్రజ్ఞుడు అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి కొనియాడారు. వేంపల్లెలో కాంగ్రెప్‌ నేతలు కలాం జయంతిని నిర్వహించారు.

Updated Date - 2021-10-17T04:48:53+05:30 IST