ఆరోగ్యశ్రీ ఆదుకొనేనా?

ABN , First Publish Date - 2021-04-17T06:04:31+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగు తు న్నాయి. దీంతో కొవిడ్‌ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అయితే, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందుతుందా? లేదా? అన్న బెంగ రోగులకు పట్టుకుంది. గతంలో కరోనా తొలిదశలో కొవిడ్‌ బాధితులు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. దీని కోసం రూ.లక్షలు వెచ్చించారు. ఉన్న కొద్దిపాటి ఆస్తులనూ అమ్ముకున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కొవిడ్‌ బాధితులకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశిం చింది. దీంతో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు బెడ్లు ఖాళీ లేవంటూ కొవిడ్‌ బాధితు లను వెనక్కు పంపించేసిన సంఘటనలు వెలుగుజూశా యి.

ఆరోగ్యశ్రీ ఆదుకొనేనా?

 బెడ్లు ఖాళీలేవని గతంలో కొవిడ్‌ రోగులను చేర్చుకోని ప్రైవేట్‌ ఆస్పత్రులు

 డబ్బు చెల్లించిన వారికే అందిన వైద్యం

కానరాని అధికారుల పర్యవేక్షణ

 ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న కేసులు

చర్యలు చేపట్టాలంటున్న ప్రజలు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 16

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగు తు న్నాయి. దీంతో కొవిడ్‌ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అయితే, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందుతుందా? లేదా? అన్న బెంగ రోగులకు పట్టుకుంది. గతంలో కరోనా తొలిదశలో కొవిడ్‌ బాధితులు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. దీని కోసం రూ.లక్షలు వెచ్చించారు. ఉన్న కొద్దిపాటి ఆస్తులనూ అమ్ముకున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కొవిడ్‌ బాధితులకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశిం చింది. దీంతో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు బెడ్లు ఖాళీ లేవంటూ కొవిడ్‌ బాధితు లను వెనక్కు పంపించేసిన సంఘటనలు వెలుగుజూశా యి. డబ్బులు చెల్లించినవా రికే ఆస్పత్రుల్లో చికిత్స అం దించేవారు. ఇప్పుడు మళ్లీ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


8 ఆస్పత్రులకు అనుమతి..

కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లాలో 8 ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు. ఇందులో ప్రైవేట్‌ 4, ప్రభుత్వ ఆస్పత్రులు 4 ఉన్నాయి. శ్రీకాకుళం లోని కిమ్స్‌, అమృత, రాగోలులోని జెమ్స్‌, పొందూరులోని పీవీఎస్‌ రామ్మోహన రావు ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేశారు. అలాగే శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, పాలకొండ ఏరియా ఆసుపత్రి, రాజాం సీహెచ్‌సీ, టెక్కలి జిల్లా ఆసుపత్రులను ఎంపిక చేశారు. కొవిడ్‌కు సంబంఽధించి 4 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందనున్నాయి. ప్రతీ ఆస్పత్రికి ఒక నోడల్‌ అధికారిని యంత్రాంగం నియమించింది. కొవిడ్‌ బాధితుడికి ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తే... రోజుకి రూ.3,250 చొప్పున చెల్లి స్తారు. గరిష్టంగా 10 రోజులకు అవకాశం ఉంది. ఐసీయూలో వైద్యం అందిస్తే రోజుకి రూ.5,480, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ అవసరమైతే రోజుకి  రూ.9,580 చెల్లిస్తారు.


పరిస్థితి మారేనా?

శ్రీకాకుళం నగరంలో పుణ్యపువీధికి చెందిన ఓ వ్యక్తి గతేడాది ఆగస్టులో కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైద్యం కోసం పలు ప్రైవేట్‌ ఆసుపత్రులను సంప్రదిస్తే బెడ్లు ఖాళీ లేవంటూ చేర్చుకోలేదు. గతంలో ఇలా ఆసుపత్రికి వెళ్తే పడకలు లేవని చెప్పి వెనక్కి పంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిబంధనల ప్రకారం తెల్లరేషన్‌ కార్డు కలిగినవారు ఆరోగ్యశ్రీలో ఉచితంగా కొవిడ్‌ చికిత్స పొందవచ్చు. అయితే, ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం ఆలస్యమవుతుందని భావించి పలుచోట్ల వైద్యం అందించని దాఖలాలు ఉన్నాయి.  గతంలో కొన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రోగుల నుంచి రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేశారు. నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ కరోనా బారినపడి శ్రీకాకుళంలో ఓ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్యం కోసం రూ.7లక్షలు వరకు కుటుంబ సభ్యులు చెల్లించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి మృతిచెందింది. దీంతో వ్యవహారం పెద్దదై... ఆ తర్వాత సద్దుమణిగింది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. గత ఏడాదిలా కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


వైద్యం అందించకపోతే చర్యలు

ఆరోగ్యశ్రీ కార్డు, తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న కరోనా బాధితులకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి. కొవిడ్‌ రోగికి 10 రోజులకు రూ.1.40 లక్షల బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనిపై ప్రత్యేక నిఘా పెడతాం. ఎక్కడైనా నిబంధనలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు రెండు ఆసుపత్రుల్లో మాత్రమే కొవిడ్‌ రోగులు ఉన్నారు. ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం ఉన్నవారికి కూడా వారి పరిమితి మేరకు ఉచితంగా చికిత్స చేయాలి.

-ప్రకాష్‌రావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌

Updated Date - 2021-04-17T06:04:31+05:30 IST