Abn logo
Sep 27 2021 @ 00:20AM

ఈ రోడ్డు దుస్థితి ఎవరికీ పట్టదా.?

గుంతలమయంగా ఉన్న పుట్టపర్తి రహదారి


అధ్వానంగా పుట్టపర్తి రహదారి

కొత్తచెరువు, సెప్టెంబరు 26 : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి వెళ్లే రహదారి అధ్వాన స్థితికి చేరుకుంది. నిత్యం ఈ రహదారిపై ఎంతో మంది వీఐపీ, జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు వెళ్తుంటారు. కానీ ఈ రహదారి సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోరు. వర్షం వచ్చిందంటే రోడ్డుపై నీటి కుంటలే. దీంతో ఈ రహదారిపై వెళ్లాలంటే వాహనదారులు, పాదాచారులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. పెద్ద గుంతలు ఏర్పడి అందులో నీరు ఉండటంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మూడు నెలల క్రితం ఈ రోడ్డుకు మరమత్తులు చేపట్టారు. అయితే అంతలోనే మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.