యజమాని కోసం.. మూడు నెలలుగా ఆస్ప‌త్రిలో శున‌కం నిరీక్ష‌ణ‌ !

ABN , First Publish Date - 2020-05-28T13:02:30+05:30 IST

చైనాలోని వూహాన్‌లో ఓ శునకం (జియాబావో) తన యజమానిపై విశ్వాసాన్ని చాటుకుంది.

యజమాని కోసం.. మూడు నెలలుగా ఆస్ప‌త్రిలో శున‌కం నిరీక్ష‌ణ‌ !

ఆయన చనిపోయిన సంగతి తెలియక 

మూడు నెలలు ఆస్పత్రిలో నిరీక్షించిన కుక్క

న్యూఢిల్లీ మే 27: చైనాలోని వూహాన్‌లో ఓ శునకం (జియాబావో) తన యజమానిపై విశ్వాసాన్ని చాటుకుంది. ఫిబ్రవరిలో కరోనా సోకినప్పటి నుంచి తన యజమాని కనిపించకపోవడంతో.. అతడు చికిత్సపొందిన ఆస్పత్రికి చేరుకొని ఏకంగా మూడు నెలలు నిరీక్షించింది. ఆస్పత్రిలో చేరిన ఐదు రోజులకే యజమాని తనువు చాలించాడని తెలియక ఆ శునకం నిరీక్షణ కొనసాగించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా నెటిజన్లు జపాన్‌లోని హచికా అనే కుక్కను గుర్తు చేసుకున్నారు. 

Updated Date - 2020-05-28T13:02:30+05:30 IST