వీధికుక్కల స్వైరవిహారం

ABN , First Publish Date - 2021-03-01T06:50:50+05:30 IST

మండలంలోని భీమవరం గ్రామంలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ఈ గ్రామంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వీధికుక్కల స్వైరవిహారం

- ఇద్దరికి గాయాలు

ఉలవపాడు, ఫిబ్రవరి 28 : మండలంలోని భీమవరం గ్రామంలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ఈ గ్రామంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 27న గ్రామంలోని వడ్డెరపాలెంలోని ఒక ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న వృద్ధురాలుని ఓ వీధికుక్క చెయ్యికొరికి గాయపరిచింది. అదేరోజు రాత్రి రెండు గంటల సమయంలో ఎస్సీ కాలనీలో ఇంటి బయట పంచలో నిద్రపోతున్న దాసరి మల్లిఖార్జున అనే  యువకుడి తల, చేతులు కొరికాయి. కుక్క పళ్లగాట్లు బలంగా పడడంతో ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందాడు. మసుషులనే కాకుండా ఇళ్లలోని పెంపుడు కుక్కలను కూడా ఇవి గాయపరుస్తున్నాయని వాటి యజమానులు వాపోయారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ నెలలో ఇదే భీమవరం గ్రామంలో 13 మందిని వీధి కుక్కలు కరిచాయి. ఆ సంఘటనలో ఇప్పటికే ఇద్దరు మహిళలు, మరోక వ్యక్తి మృతి చెందారు.ఆ ఘటన మరువక ముందే మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సీహెచ్‌ లక్ష్మీలతను వివరణ కోరగా ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రామంలోని వీధి కుక్కలను పట్టించినట్లు తెలిపారు. ఆదివారం కూడా మరోమారు గ్రామంలో మిగిలి ఉన్న వీధికుక్కలను పట్టిస్తామన్నారు. గాయపడిన వాళ్లను వైద్య పర్వేక్షణలో ఉంచి చికిత్స అందిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-03-01T06:50:50+05:30 IST