పోలీస్‌ జాగిలాల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T06:09:20+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్‌ జాగిలాలను విజయవాడకు శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్‌ జాగిలాలను విజయవాడకు చెందిన ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ సభ్యులు గురువారం పరిశీలించారు.

పోలీస్‌ జాగిలాల పరిశీలన
జాగిలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

వాటి పనితీరు, ఆరోగ్యాన్ని తనిఖీ చేసిన ఇంటెలిజెన్స్‌ అధికారులు 

విశాలాక్షినగర్‌, డిసెంబరు 3: శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్‌ జాగిలాలను విజయవాడకు  శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్‌ జాగిలాలను విజయవాడకు చెందిన ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ సభ్యులు గురువారం పరిశీలించారు. కైలాసగిరి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలోని రిజర్వు డీఎస్పీ ఆర్‌పీఎల్‌ శాంతికుమార్‌ నేతృత్వంలో జాగిలాల పనితీరు, ఆరోగ్యం, చురుకుదనం, స్పందన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీఐపీ బందోబస్తు విధుల్లో, నేరస్తులు, మందుపాతరలను గుర్తించడం, మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు ఇక్కడ పది జాగిలాలు ఉన్నాయి. వీటిలో ఆరు పేలుడు పదార్థాలు, మరో నాలుగు జాగిలాలను మాదక ద్రవ్యాలు, తదితర వాటిని గుర్తించేందుకు వినియోగిస్తున్నారు. జాగిలాలను పరిశీలించిన వారిలో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ సీఐ టీఎన్‌ శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్‌ ఎస్‌.ప్రతాప్‌, ట్రైనర్‌ జీఆర్‌సీ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-04T06:09:20+05:30 IST