‘‘ప్రచార చిత్రాలు చూశాక... దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ఆలోచనలు మారాయనిపించింది. హీరో రాజ్‌తరుణ్‌తో ఇటువంటి సస్సెన్స్ థ్రిల్లర్ నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని కె.ఎస్. రామారావు అన్నారు. రాజ్‌తరుణ్, విజయ్‌కుమార్ కొండా కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘పవర్ ప్లే’. శ్రీమతి పద్మ సమర్పణలో మహీధర్, దేవేష్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఆదివారం ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రాజ్ తరుణ్ ఇప్పటివరకూ వినోదాత్మక, ప్రేమకథా చిత్రాలే చేశాడు. లాక్డౌన్లో ప్రేక్షకులు ప్రపంచ చిత్రాలు చూశారు కాబట్టి... మమ్మల్ని కొత్త ఆవిష్కరించుకోవాలని ఈ చిత్రం చేశాం. నేనిప్పటివరకూ ట్రై చేయని కొత్త జానర్లో ఉంటుంది. రాజ్లోనూ కొత్త యాంగిల్ చూస్తారు’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని కొత్త పాత్ర చేశా’’ అని పూర్ణ తెలిపారు. ‘‘పూర్ణగారు ఆ పాత్ర చేయడంతో సినిమా మరోస్థాయికి వెళ్లింది’’ అని రాజ్ తరుణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కె.కె. రాధామోహన్ తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొంది.