ఢోక్లా

ABN , First Publish Date - 2021-05-22T19:10:21+05:30 IST

పెసలు - అరకప్పు, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, రవ్వ - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపిండి - ఒక

ఢోక్లా

కావలసినవి: పెసలు - అరకప్పు, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, రవ్వ - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపిండి - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, పంచదార - నాలుగు టీస్పూన్లు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, ఈనో పౌడర్‌ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: పెసలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన నీళ్లు తీసివేసి పచ్చిమిర్చి వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకుని అందులో రవ్వ, శనగపిండి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. ఈలోగా ఢోక్లా మేకింగ్‌ ప్లేట్లకు నూనె రాసి పెట్టుకోవాలి. మిశ్రమంలో ఈనో కలపాలి. ఈనో కలిపిన వెంటనే మిశ్రమంలో బుడగలు వస్తాయి. మిశ్రమం రెట్టింపవుతుంది. వెంటనే మిశ్రమాన్ని ప్లేట్లలో పోయాలి. ప్లేట్లను కుక్కర్‌లో పెట్టి పావుగంట పాటు ఉడికించాలి. ఆవిరిపోయిన తరువాత తీసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-05-22T19:10:21+05:30 IST