దోమ తెరే.. వాలీబాల్‌ నెట్‌!

ABN , First Publish Date - 2021-04-22T05:04:11+05:30 IST

దోమ తెరే.. వాలీబాల్‌ నెట్‌!

దోమ తెరే.. వాలీబాల్‌ నెట్‌!
వాలీబాల్‌ నెట్‌గా ఉపయోగిస్తున్న దోమ తెర

ఈ ఫొటో చూశారా... దోమతెరను ఎంచ్చక్కా వాలీబాల్‌ నెట్‌గా వినియోగిస్తున్నారో... ఏజెన్సీలో దోమల నుంచి రక్షణ పొందేందుకు గిరిజనులకు ఇచ్చిన దోమతెరల్లో ఇదొకటి. అధికారులు ఎంతో సదుద్ధేశంతో దోమతెరలు సరఫరా చేస్తున్నా... వాటిని వినియోగించడంలో గిరిజనులకు అవగాహన లేకపోవడమో... లేక నిర్లక్ష్యంతోనో ఇలా వాలీబాల్‌ నెట్‌గా వినియోగించుకుంటున్నారు. పాచిపెంట మండలం మంచాడవలసలో వాలీబాల్‌ ఆటకోసం దోమతెరను నెట్‌గా  క్రీడాకారులు ఉపయోగించడం ‘ఆంధ్రజ్యోతి’ కంటపడింది. కాగా దోమతెరల వినియోగంపై పూర్తిస్థాయిలో గిరిజనులకు అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది విఫలమవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గిరిజన ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- సాలూరు రూరల్‌ 


Updated Date - 2021-04-22T05:04:11+05:30 IST