Abn logo
Feb 20 2021 @ 01:09AM

వాట్సాప్‌, ట్విట్టర్‌, షేర్‌ఇట్‌లకు దేశీ ప్రత్యామ్నాయాలు

చిన్న సంఘటనలతో మొదలైన ఆలోచన భారీ మార్పులకు నాంది కావచ్చు. వాట్సాప్‌, ట్విట్టర్‌లకు వ్యతిరేకంగా మొదలైన దేశీబాట ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతోంది. చైనాతో ఘర్షణ నేపథ్యంలో రెండు వందలకు మించి స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లపై భారతదేశం నిషేధం విధించింది. స్వదేశీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. దాదాపు మేజర్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాలు అన్నింటికీ మేడ్‌-ఇన్‌-ఇండియా ప్రొడక్ట్‌ల రూపకల్పనకు బాసటగా నిలిచింది. గూగుల్‌ మ్యాప్‌లకు పోటీగా వ్యవహరించేందుకు ఇస్రో(ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) - మైమ్యాప్‌ ఇండియాతో చేతులు కలిపింది.   ట్విట్టర్‌కు పోటీగా ‘కూ’ని  కేంద్ర సీనియర్‌ మంత్రులు  ప్రమోట్‌ చేస్తున్నారు. అలా పోటీగా మార్కెట్లోకి వచ్చిన ఓ పదింటిని చూద్దాం. 


‘గూగుల్‌ మ్యాప్స్‌’  vs ‘భువన్‌’

గూగుల్‌ మ్యాప్‌లకు ఇది ప్రత్యామ్నాయం ‘భువన్‌’. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇప్పటికే జియోస్పేషియల్‌ టెక్నాలజీ కంపెనీ- సిఇ ఇన్ఫో సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఎంఒయు కుదుర్చుకుంది.  ఈ కంపెనీ ఆధ్వర్యంలో గూగుల్‌ మ్యాప్‌లకు ప్రత్యామ్నాయ యాప్‌ తయారీలో ఉంది. ఇండియన్‌ రీజనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ని ఉపయోగించుకుంటుంది. దాన్నే నేవల్క్‌(నేవిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కనస్టలేషన్‌) అంటారు. ఇస్రో దీన్ని అభివృద్ధిపర్చింది. 

‘వాట్సాప్‌’ vs ‘సందేశ్‌’

‘వాట్సాప్‌’నకు ప్రత్యామ్నాయంగా ‘సందేశ్‌’ ముందుకు వచ్చింది. దీన్ని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసి) రూపొందించింది. ఇప్పటికే ఐఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆండ్రాయిడ్‌ యాప్‌గా మలిచే కృషి జోరుగా సాగుతోంది. వాట్సాప్‌ మేజర్‌ ఫీచర్‌ - ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను కూడా ‘సందేశ్‌’ అందిస్తోంది. షేరింగ్‌, మెసేజ్‌ స్టయిలింగ్‌, మెసేజ్‌ టాగింగ్‌, బాకప్‌, రిస్టోర్‌ గ్రూప్‌ చాట్‌, వీడియో, వాయిస్‌ కాల్స్‌ వంటి ఇతర ఫీచర్లు సైతం ఇందులో ఉన్నాయి. 

టిక్‌టాక్‌ vs ‘చింగారీ’,‘జోష్‌’, ‘మోజ్‌’, ‘మిత్రో’

టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో అనేకానేక దేశీయ షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫారాలు అభివృద్ధి చెందాయి. ఇవి టిక్‌టాక్‌ను రీప్లేస్‌ చేశాయి.  ‘టకాటక్‌’, ‘మిత్రో’, ‘మోజ్‌’, ‘జోష్‌’, ‘చింగారి’ వంటివి ఇందులో ఉన్నాయి.

‘గూగుల్‌ డ్రైవ్‌’ vs ‘డీజీ బాక్స్‌’

‘గూగుల్‌ డ్రైవ్‌’కు పోటీగా రూపొందింది. దేశీయంగా సృష్టించిన క్లౌడ్‌ స్టోరేజ్‌ ప్లాట్‌ఫారం ఇది. రెగ్యులర్‌ వినియోగదారులకు తోడు వ్యాపార సంస్థలు ఉపయోగించుకునే విధంగా ఈ దేశీ గూగుల్‌ డ్రైవ్‌ రూపొందించారు. 

‘కామ్‌స్కానర్‌’  vs కార్బన్‌ స్కానర్‌’

‘కామ్‌స్కానర్‌’కు పోటీగా దేశీయంగా ‘కార్బన్‌ స్కానర్‌’ అందుబాటులోకి వచ్చింది. దేశీ యాప్స్‌ సృష్టికర్త ‘కె షార్క్‌’ యాప్స్‌ దీని రూపొందించింది. పీడీఎఫ్‌ తయారు చేసుకోవడానికి ఇదో నమ్మకమైన యాప్‌.

‘షేర్‌ఇట్‌’ vs ‘జెడ్‌ షేర్‌’

షేర్‌ఇట్‌కు ఇది దేశీపోటీ. ‘షేర్‌ఇట్‌’పై నిషేధం తరవాత శ్రావణ్‌ హెగ్డే అనే వ్యక్తి దీన్ని రూపొందించారు. షేర్‌ఇట్‌ తరహాలో యూజర్స్‌కు ఉపయోగకరంగా ఉంటుంది.  

‘పబ్జీ’  vs ‘ఫౌజీ’

‘పబ్జీ’కి ప్రత్యామ్నాయం ‘ఫౌజీ’. బెంగళూరుకు చెందిన గేమ్‌ పబ్లిషర్‌ ఎన్‌కోర్‌ గేమ్స్‌ ‘ఫౌజీ’ని రూపొందించింది.  


‘ఎలిమెంట్స్‌’  vs ‘ఫేస్‌బుక్‌’, ‘ఇన్‌స్టా’

‘ఫేస్‌బుక్‌’, ‘ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రత్యామ్నాయంగా అత్యుత్తమ ప్రైవసీ ఫీచర్లతో ‘ఎలిమెంట్స్‌’ యాప్‌ని రూపొందించారు.  గత సంవత్సరమే దీనిని అందుబాటులోకి తెచ్చారు.


‘క్లబ్‌హౌస్‌’  vs ‘లెహర్‌’

‘క్లబ్‌హౌస్‌’ యాప్‌ మాదిరిగానే ‘లెహర్‌’ కూడా పనిచేస్తుంది. ఆడియో, వీడియోలను సపోర్ట్‌ చేసే ఈ మేడ్‌-ఇన్‌-ఇండియా యాప్‌ ఐఔస్‌, ఆండ్రాయిడ్‌లో లభ్యమవుతోంది.

‘ట్విట్టర్‌’  vs ‘కూ’

ట్విట్టర్‌ అందిస్తున్న అన్ని సదుపాయాలను ‘కూ’ అందిస్తోంది. అదనంగా దేశీ భాషల్లోనూ టైపింగ్‌ అవకాశాన్ని ఇస్తోంది. ఐఔస్‌, ఆండ్రాయిడ్‌ అలాగే వెబ్‌ బ్రౌజర్‌లో లభ్యమవుతుంది. ప్రస్తుతం అన్ని భారతీయ భాషలపై ఫోకస్‌ పెట్టింది. ఇదే సందర్భంలో మరో స్వదేశీ సోషల్‌ నెట్‌వర్క్‌గా ‘టూటర్‌’ కూడా యవనిక పైకి వచ్చింది. ‘టూటర్‌’ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకుని షార్ట్‌ మెసేజ్‌లను పోస్ట్‌ చేసుకోవచ్చు. టెక్స్ట్‌, పిక్చర్స్‌, వీడియోస్‌ వంటివన్నీ టూట్స్‌లో ఉంటాయి. 

Advertisement
Advertisement
Advertisement