వంటగ్యాస్‌ సరఫరా సిబ్బంది సేవలు ప్రశంసనీయం: గంగుల

ABN , First Publish Date - 2020-08-09T07:52:36+05:30 IST

కరోనా కష్టకాలంలోనూ వంటగ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసే సిబ్బంది సేవలు ప్రశంసనీయమని మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. రాష్ట్రంలో వంటగ్యాస్‌ డీలర్లు రోజుకు 2 లక్షల సిలిండర్లను సిబ్బందిచే సరఫరా చేయిస్తూ తమ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారన్నారు...

వంటగ్యాస్‌ సరఫరా సిబ్బంది సేవలు ప్రశంసనీయం: గంగుల


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలోనూ వంటగ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసే సిబ్బంది సేవలు ప్రశంసనీయమని మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. రాష్ట్రంలో వంటగ్యాస్‌ డీలర్లు రోజుకు 2 లక్షల సిలిండర్లను సిబ్బందిచే సరఫరా చేయిస్తూ తమ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారన్నారు. శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన తెలంగాణ ఎల్పీజీ డీలర్ల రెండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. గ్యాస్‌ డీలర్లు సేవా భావంతో పనిచేయటంతోనే కరోనా సమయంలో ఏనాడు వంట గ్యాస్‌కు ఇబ్బందులు కలగలేదన్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వర్‌ రావు, ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ.. వంటగ్యాస్‌ డీలర్ల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్యాస్‌ డీలర్ల సంఘం ప్రతినిధి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-09T07:52:36+05:30 IST