విదేశాల్లో సెటిల్ అయిన కుమారులు.. తల్లి ఫోన్‌కు వచ్చిందో మెసేజ్.. కంగారుగా వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2021-12-10T00:04:57+05:30 IST

విదేశాల్లో సెటిలైన మహిళకు ఊహించని షాక్..ఆమెకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్‌ నుంచి ఐదు లక్షలు మాయం..విషయం ఏంటా అని ఆరా తీస్తే..

విదేశాల్లో సెటిల్ అయిన కుమారులు.. తల్లి ఫోన్‌కు వచ్చిందో మెసేజ్.. కంగారుగా వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఎంతో కాలంగా విదేశాల్లోనే ఉంటున్నారు. పిల్లలు కూడా అక్కడే సెటిలయ్యారు. అప్పుడప్పుడూ  ఇండియాకు వచ్చి వెళుతుంటారు. ఇక్కడ ఆమెకో సొంతిల్లు ఉంది. అయితే.. ఇటీవల ఓ రోజున ఆమె మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. డెబిట్ కార్డు ద్వారా రూ. 40 వేలు విత్‌డ్రా అయ్యాయనేది ఆ మెసేజ్ సారాంశం.  దీంతో.. ఆమెకు క్షణకాలం పాటూ ఏమీ పాలుపోలేదు. తాను ఏటీఎంకు వెళ్లకపోయినా ఇంత డబ్బు ఎలా విత్‌డ్రా అయిందో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా వెలుగులోకి వచ్చిన విషయం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తరువాత  ఆమె భారత్‌లోని పోలీసులను సంప్రదించింది. వారు రంగంలోకి దిగి తీగ లాగితే డొంకంతా కదిలింది. తన ఇంట్లో ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషే చాలా చాకచక్యంగా రూ.5 లక్షలు కొట్టేసిందని తెలిసి ఆమె షాకైపోయింది. చండీగఢ్‌కు చెందిన కనాన్ సింగల్ ఇటీల ఎదుర్కొన్న పరిస్థితి ఇది. 


కనాన్ సింగల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇదంతా ఇంటి దొంగపనేనని కనిపెట్టారు. సింగల్ ఇంట్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సరోజినియే ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనాన్ డెబిట్ కార్డుతో నిందితురాలు అప్పుడప్పుడు నగదు విత్‌డ్రా చేసేది. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశ్యంతో డెబిట్ కార్డును మళ్లీ యథాస్థానంలో పెట్టేసేది. కుదిరినప్పుడల్లా కనాస్ మొబైల్‌లో బ్యాంకు నుంచి వచ్చిన మెసేజీలను కూడా తొలగించేది. ఇలా రూ. 5 లక్షల మేర తస్కరించింది. కానన్ ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కింది. కాగా.. పోలీసులు సరోజిని నుంచి దాదాపు 3.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వారు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆమెను పోలీస్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు.  

Updated Date - 2021-12-10T00:04:57+05:30 IST