దేశీయ మైక్రోప్రాసెసర్‌ ‘మౌక్షిక్‌’

ABN , First Publish Date - 2020-10-03T05:31:14+05:30 IST

ఐఐటి మద్రాస్‌ దేశీయంగా మైక్రోప్రాసెసర్‌ ‘మౌక్షిక్‌’కు రూపకల్పన చేసింది. ఇంటెర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఒటి) డివైసెస్‌ కోసం దీన్ని రూపొందించింది...

దేశీయ మైక్రోప్రాసెసర్‌ ‘మౌక్షిక్‌’

ఐఐటి మద్రాస్‌ దేశీయంగా మైక్రోప్రాసెసర్‌ ‘మౌక్షిక్‌’కు రూపకల్పన చేసింది. ఇంటెర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఒటి) డివైసెస్‌ కోసం దీన్ని రూపొందించింది. ప్రాసెసర్‌ కమ్‌ ‘సిస్టమ్‌ ఆన్‌ చిప్‌’గా ఇది ఐఒటి డివైసెస్‌కు ఉపయోగపడుతుంది. ఐఐటి మద్రాస్‌లోని ప్రతాప సుబ్రమణ్యమ్‌ సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూర్‌ హార్డ్‌వేర్‌ ఆర్కిటెక్చర్‌కు చెందిన ‘రైజ్‌’ గ్రూప్‌ దీన్ని అభివృద్ధిపర్చింది. ఈ మైక్రోప్రాసెసర్‌ రూపకల్పనలో భాగంగా మూడు దశలు -  డిజైన్‌, ఫాబ్రికేషన్‌, పోస్ట్‌ సిలికాన్‌ బూట్‌-ఆప్‌  దేశీయంగా  అంటే మద్రాస్‌ ఐఐటిలోనే రూపొందాయి. ‘శక్తి కుటుంబా’నికి సంబంధించి ఇది మూడో చిప్‌. క్రెడిట్‌ కార్డు, ఐడీ కార్డ్‌ వంటి స్మార్ట్‌ కార్డులు మొదలుకుని ఇవిఎం,  అటెండెన్స్‌ తదితర ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ వరకు ‘మౌక్షిక్‌’ ఉపయోగపడుతుంది. 

Updated Date - 2020-10-03T05:31:14+05:30 IST