Aug 4 2021 @ 01:20AM

గాయకుడు హనీ సింగ్‌పై గృహహింస ఆరోపణలు

హిందీ గాయకుడు హనీ సింగ్‌ మద్యానికి, వ్యభిచారానికి బానిస అయ్యారని అతని భార్య శాలినీ సింగ్‌ ఆరోపించారు. ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో భర్తపై ఓ పిటీషన్‌ దాఖలు చేశారామె. అందులో భర్త, అతని తల్లితండ్రులు, చెల్లెలు తనను శారీరకంగా, మానసికంగా పలుమార్లు వేధించారని పేర్కొన్నారు. గృహహింసకు లోనయ్యానని తెలిపారు. హానీమూన్‌లోనే తమ మధ్య మనస్ఫర్థలు తలెత్తాయని, తనపై హనీ సింగ్‌ చేయి చేసుకున్నాడని శాలినీ సింగ్‌ చెప్పుకొచ్చారు. ఆమె పిటీషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 23, 2011లో హనీ సింగ్‌, శాలినీ సింగ్‌కు వివాహమైంది. అయితే, చాలా రోజులు పెళ్లైన విషయాన్ని హనీ సింగ్‌ చెప్పలేదు. ప్రజలకు 2014లో, ఓ రియాలిటీ షోలో భార్యను పరిచయం చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు తాను బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు వెల్లడించారు. మద్యానికి బానిస అయినట్టు కూడా తెలిపారు. వివిధ మహిళలతో హనీ సింగ్‌ శారీరక సంబంధాలు ఉన్నాయని శాలిని ఆరోపిస్తున్నారు.


Bollywoodమరిన్ని...