వ్యాక్సినేష‌న్‌.. డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల విష‌యంలో కువైట్ కీల‌క నిర్ణ‌యం!

ABN , First Publish Date - 2021-06-19T14:27:05+05:30 IST

వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న విదేశీయుల‌కు గ‌ల్ఫ్ దేశం కువైట్‌ ఆగ‌స్టు నుంచి త‌మ దేశంలోకి ప్ర‌వేశానికి అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల ప్ర‌వేశంపై కువైట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

వ్యాక్సినేష‌న్‌.. డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల విష‌యంలో కువైట్ కీల‌క నిర్ణ‌యం!

కువైట్ సిటీ: వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న విదేశీయుల‌కు గ‌ల్ఫ్ దేశం కువైట్‌ ఆగ‌స్టు నుంచి త‌మ దేశంలోకి ప్ర‌వేశానికి అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల ప్ర‌వేశంపై కువైట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సినేష‌న్ నుంచి డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల‌కు మిన‌హాయింపు ఇచ్చింది. కువైట్ వ‌చ్చేవారికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అవ్వాల‌నే నిబంధ‌న నుంచి డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల‌కు మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ఫెడ‌రేష‌న్ ఆఫ్ డొమెస్టిక్ లేబ‌ర్ ఆఫీసెస్ ప్ర‌క‌టించింది. 'రెండు డోసుల క‌రోనా టీకా తీసుకున్న‌వారికే దేశంలో ఎంట్రీకి అనుమ‌తి ఇవ్వాల‌నే నిబంధ‌న నుంచి డొమెస్టిక్ వ‌ర్క‌ర్లకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది' అని డొమెస్టిక్ లేబ‌ర్ ఫెడ‌రేష‌న్ ట్వీట్ చేసింది. ఇక డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల ఎంట్రీ కోసం రూపొందించిన ప్ర‌త్యేక‌ యాప్ ద్వారా ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కువైట్ రెడీ చేసింది. 

Updated Date - 2021-06-19T14:27:05+05:30 IST