కరోనాతో ఆందోళనకు గురికావొద్దు

ABN , First Publish Date - 2020-08-15T11:00:47+05:30 IST

కరోనా వైరస్‌ సోకిన వారు ఆందోళ నకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యా ధికారి రమేష్‌ అన్నారు.

కరోనాతో ఆందోళనకు గురికావొద్దు

డీఎం అండ్‌ హెచ్‌వో రమేష్‌


వేల్పూర్‌: కరోనా వైరస్‌ సోకిన వారు ఆందోళ నకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యా ధికారి రమేష్‌ అన్నారు. శుక్రవారం వేల్పూర్‌ పీ హెచ్‌సీని ఆయన సందర్శించి మండలంలో కరో నా వైరస్‌ ప్రభావం నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన విలేకరులతో మాట్లాడుతూ కరోనా పాజి టివ్‌ రాగానే భయాందోళనకు గురికావొద్దన్నారు.  ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని సులభ ంగా నివారించవచ్చన్నారు.


బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులను కడుక్కోవడం, గుంపులుగా ఫంక్షన్‌హాల్‌కు వెళ్లకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా పరీక్ష లు చేసే సదుపాయం ఉందన్నారు. అక్కడే కరో నా పాజిటివ్‌ వచ్చిన వారికి హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కిట్స్‌లు ఇవ్వడం జరుగుతోందన్నా రు. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకొని కరోనా పట్ల భయాన్ని వదిలేయాలన్నారు. ఆయన వెం ట పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ అశోక్‌, వెంక టరమణ, పీహెచ్‌సీ వైద్యులు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-08-15T11:00:47+05:30 IST