తాలిబన్లకు అమెరికా అంటే భయం, గౌరవం లేవు: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

ABN , First Publish Date - 2021-08-22T01:27:29+05:30 IST

అఫ్ఘానిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన విధానం విఫలమైందంటూ అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు.

తాలిబన్లకు అమెరికా అంటే భయం, గౌరవం లేవు: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన విధానం విఫలమైందంటూ అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. తాలిబన్ల ముందు ఓటమి అంగీకరించారంటూ బైడెన్‌పై విరుచుకుడ్డారు. చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డ బైడెన్ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఇది సేనల ఉపసంహరణ కాదు. ఒటమిని ఒప్పుకోవడం. అమెరికా అంటే తాలిబన్లకు ప్రస్తుతం భయం, గౌరవం లేకుండా పోయింది. కాబూల్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగిరితే ఎంతటి అపఖ్యాతో ఊహించండి. బలహీనత, చేతకానీతనంతో వచ్చిన వైఫల్యం ఇది’’ అని ట్రంప్ నేడు జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-22T01:27:29+05:30 IST