పాకిస్థాన్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముతున్న ట్రంప్!

ABN , First Publish Date - 2021-06-14T01:26:55+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు.. షాక్ అవుతున్నారు. ‘వామ్మో.. డొనాల్డ్ ట్రంప్ ఏంటి.. కుల్ఫీలు అమ్ముకోవడం ఏంటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి

పాకిస్థాన్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముతున్న ట్రంప్!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు.. షాక్ అవుతున్నారు. ‘వామ్మో.. డొనాల్డ్ ట్రంప్ ఏంటి.. కుల్ఫీలు అమ్ముకోవడం ఏంటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి పాకిస్థాన్‌ వీధుల్లో ప్రత్యక్షం అయ్యాడు. బండిని తోసుకుంటూ ‘ఎ.. కుల్ఫీకుల్ఫీకుల్ఫీ..’ అని రాగయుక్తంగా పాడుతూ కుల్ఫీలను అమ్ముకుంటుండటాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. కుల్ఫీలు అమ్ముకునే వ్యక్తికి కొంచెం అటు ఇటుగా ట్రంప్ పోలికలే ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘కుల్ఫీలు అమ్ముతున్న డొనాల్డ్ ట్రంప్!’ అనే వ్యాఖ్యాన్ని జత చేస్తూ ఆ వీడియోను తమ స్నేహితులతో పంచుకుంటున్నారు. 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2021-06-14T01:26:55+05:30 IST