Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్ క్లోజ్.. కారణమిదే !

ఫ్లోరిడా: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని 'మార్-ఎ-లాగో' రిసార్ట్ మూతపడింది. రిసార్ట్‌లో పనిచేసే కొంతమంది సిబ్బందికి కరోనా సోకడంతో పాక్షికంగా మూసివేసినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికన్ ప్రముఖ మీడియా ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. 'తాజాగా మా సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అందుకే బీచ్ క్లబ్, లా కార్టే డైనింగ్ రూమ్‌ను పాక్షికంగా మూసివేశాం.' అని క్లబ్ నిర్వహణ బృందం చేసిన ట్వీట్‌ను న్యూస్ ఏజెన్సీ తన కథనంలో ప్రచురించింది. అయితే, ఎంతమంది క్లబ్ సిబ్బంది వైరస్ బారిన పడింది మాత్రం వెల్లడించలేదు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్‌హౌస్‌ను వీడినప్పటి నుంచి ట్రంప్ ఈ రిసార్ట్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.     

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement