రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

ABN , First Publish Date - 2021-05-08T05:38:06+05:30 IST

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి
శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎస్‌ఐ వరప్రసాద్‌

తలకొండపల్లి: రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రాణాన్ని కాపాడటంతో రక్తదాతలు నిలుస్తారని ఎస్‌ఐ వరప్రసాద్‌ అన్నారు. రక్త, నేత్ర, అవయవ దానాలపై ప్రజలు అపోహాలు వీడాలని కోరారు. తలకొండపల్లి జడ్పీ పాఠశాల ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఏబీవీపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులతో కలిసి ఎస్‌ఐ వరప్రసాద్‌ శిబిరాన్ని ప్రారంభించారు. 50మంది రక్తదానం చేశారు. కరోనాతో రక్త నిల్వలు నిండుకున్నందున రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలన్నారు. గ్రామీణ పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాల ద్వారా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు వైద్య సేవలందించాలని ఎస్సై కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ ఖండ సహకార్య్‌వాహ్‌ నూకం శివ, శారీర క్‌ ప్రముఖ్‌ అరుణ్‌, మండల కార్య్‌వాహ్‌ బాలకృష్ణ, శ్రీకాంత్‌, రమేశ్‌, రాము, పుట్ట శ్రీరామ్‌, నరేశ్‌, ఏబీవీపీ నగర కార్యదర్శి వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:38:06+05:30 IST