సీఎం సహాయ నిధికి వ్యవసాయ సహకార సంఘం విరాళం

ABN , First Publish Date - 2020-06-03T22:10:00+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువన గిరి మండలం చందుపట్ల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌ మందడి లక్ష్మీ నర్సింమారెడ్డి 2లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

సీఎం సహాయ నిధికి వ్యవసాయ సహకార సంఘం విరాళం

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువన గిరి మండలం చందుపట్ల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌ మందడి లక్ష్మీ నర్సింమారెడ్డి 2లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబందించిన చెక్కును పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం మున్సిపల్‌శాఖ కార్యాలయంలో ఆశాఖ మంత్రి కె. తారక రామారావుకు అందజేశారు. ఈసందర్బంగా మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఖజాను లెక్కచే యకుండా ప్రజల ప్రాణమే ముఖ్యమని భావించి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ సహా రైతులు, కూలీలు, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ దశంలో అనేక మంది దాతలు సీఎంకి తమ వంతు సాయంగా విరాళాలలను అందిస్తున్నారని తెలిపారు. దాతలు మరింతగా ముందుకు వచ్చి విరాళాలను అందించాలని చెప్పారు. 

Updated Date - 2020-06-03T22:10:00+05:30 IST