ఆదుకోండి

ABN , First Publish Date - 2020-12-04T05:44:11+05:30 IST

తుఫాన్‌, భారీవర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయా మని, ప్రభుత్వం ఆదుకోవాలని పలు మం డలాల రైతులు...కేంద్ర బృందాన్ని వేడుకున్నారు.

ఆదుకోండి
పాయకరావుపేట మండలం పాల్తేరులో మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

కేంద్ర బృందానికి అన్నదాతల వేడుకోలు

కుళ్లిపోయిన వరి పైరు, మొలకెత్తిన/రంగుమారిన ధాన్యాన్ని చూపించిన రైతులు

రోజుల తరబడి పంట నీటిలో ఉండడంతో పూర్తిగా నష్టపోయామని ఆవేదన

ల్యాబ్‌లో పరీక్షల కోసం పలుచోట్ల నమూనాల సేకరణ

నేడు నర్సీపట్నం, చింతపల్లి ప్రాంతాల్లో పర్యటన


విశాఖపట్నం/పాయకరావుపేట రూరల్‌/ఎలమంచిలి/
రాంబిల్లి/మునగపాక, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): 

తుఫాన్‌, భారీవర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయా మని, ప్రభుత్వం ఆదుకోవాలని పలు మం డలాల రైతులు...కేంద్ర బృందాన్ని వేడుకున్నారు. ఇటీవల సంభవించిన ‘నివర్‌’ తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న ఎనిమిది మండలాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించింది. నీట మునిగిన వరి పనలు, మొలకెత్తిన ధాన్యం, పొలంలోనే కుళ్లిపోయిన వరి పైరును ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు ఆయా ప్రాంతాల్లో రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి పనలు రోజుల తరబడి నీటిలో వుండిపోవడంతో కుళ్లిపోవడం, ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం వంటివి జరిగాయని బాధిత రైతులు వాపోయారు. కొన్నిచోట్ల రైతులను సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రప్పించి, వారు తీసుకువచ్చిన కుళ్లిపోయిన పైరు, మొలకె త్తిన ధాన్యాన్ని అధికారులు పరిశీలించారు. నీటమునిగి, తడిసిన ధాన్యం నమూనా లను విశాఖలోని భారత ఆహార సంస్థ ప్రయోగశాలలో పరీక్షించి, ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కాగా రంగు మారిన, మొలకెత్తిన ధాన్యానికి కొనుగోలు ధర నిర్ణయించడానికి ఒక్కో కొనుగోలు కేంద్రం నుంచి మూడు శ్యాంపిల్స్‌ సేకరిస్తున్నట్టు జేడీ లీలావతి చెప్పారు. కేంద్ర బృందంలోని అధికారులు మొత్తం ఎని మిదిచోట్ల శాంపిల్స్‌ సేకరించారు. ఈ బృందంలో ఆహార, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.జడ్‌.ఖాన్‌, హైదరాబా ద్‌లోని స్టోరేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధి కారులు నవీన్‌, జి.కిరణ్‌కుమార్‌, వ్యవ సా య శాఖ జిల్లా జేడీ లీలావతి, పౌర సరఫ రాల జిల్లా మేనేజరు వెంకటరమణ, తది తరులు ఉన్నారు. కేంద్ర బృందం శుక్రవారం నర్సీపట్నం, చింతపల్లి మండలాల్లో పర్యటించనున్నది.


పాయకరావుపేట మండలం పాల్తేరు లో నీట మునిగిన వరి పంటను, మొలకలు వచ్చిన/రంగు మారిన ధాన్యాన్ని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ, చేతికొచ్చిన పంట పూర్తిగా నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్థానిక అధికారులు లచ్చన్న, డి.సౌజన్య, సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.


రాంబిల్లి మండలం దిమిలి పీఏసీఎస్‌ వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. మండల వ్యవసాయ సిబ్బంది, రైతులు వివిధ గ్రామాల నుంచి తెచ్చిన వరి కంకులు, తడిసిన/మొల కెత్తిన ధాన్యం శాంపిల్స్‌ను బృందం సభ్యులు తీసుకున్నారు. రైతులు, వ్యవసాయ అధికారులతో మాట్లాడి, పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. స్థానిక అధికారులు గాయత్రి, రంగాచారి, తదితరులు పాల్గొన్నారు. 


ఎలమంచిలి మునిసిపాలిటీ పరి ధిలోని కొక్కిరాపల్లి పీఏసీఎస్‌ వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించింది. సోమలింగపాలెం గ్రామానికి చెందిన వెంకన్న అనే రైతు తీసుకువచ్చిన మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని పరిశీలించింది. స్థానిక అధికారులు స్వప్న, రంగాచారి పాల్గొన్నారు. మునగపాక మండలంలోని పలు గ్రామాల రైతులు దెబ్బతిన్న వరి పన లు, రంగుమారిన/మొలకెత్తిన ధాన్యం నమూనాలను స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చారు. వీటిని కేంద్రం బృం దం పరిశీలించింది. అయితే దెబ్బతిన్న పంటలను స్వయంగా వచ్చి పరిశీ లించకపోవడంపై పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర బృం దం వస్తున్నట్టు కొద్దిమందికి మాత్ర మే సమాచారం ఇచ్చారని, దీంతో పంట నష్ట వివరాలను తెలియజేసే అవకాశం చాలా మంది లేకపోయిందని  రైతులు మురళీ, శ్రీను, రమణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-04T05:44:11+05:30 IST