Abn logo
Sep 27 2021 @ 00:11AM

వేదశ్రీ వైద్య చికిత్సకు దాతల బాసట

నగదు అందిస్తున్న సంఘ నాయకులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

రాజాం, సెప్టెంబరు 26: పట్టణ పరిధిలోని మేదరవీధి చెరువు గట్టుపై నివాసముంటున్న జంపు వేదశ్రీకి వైద్య సేవలకు అవసరమైన సాయం అందించేందుకు నెయ్యిల కులసంఘ నాయకులు ముందుకు వచ్చారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘మంచం పట్టిన వేదశ్రీ’ శీర్షికతో వచ్చిన కథనానికి వారు స్పందించారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి వేదశ్రీ పరిస్థితిని చూసిన వారు స్పందించి  రూ.1,03,500 నగదును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. చిన్నారి వైద్యం కోసం తాము అన్ని విధాలా సహకరిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింగిడి సూరిబాబు, తాతపూడి వెంకటరమణ తదితరులు పేర్క న్నారు. టెక్కలి కూర్మారావు, సిద్ధాంతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జంపు వేదశ్రీకి మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. వేదశ్రీ తల్లిదండ్రులు ఆయనను కలిసి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. అంచనాలు తయారుచేసి అందిస్తే సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహాత్మా గాంధీ క్యాన్సన్‌ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు.