దాతల ఔదార్యం..

ABN , First Publish Date - 2021-06-23T04:06:18+05:30 IST

దాతల ఔదార్యం..

దాతల ఔదార్యం..
విరాళాన్ని అందజేస్తున్న ఎంపీడీవో శరత్‌బాబు, ఖాజాపాషా

  • కరోనాతో మృతిచెందిన జర్నలి్‌స్ట తల్లిదండ్రులకు ఆర్థికసాయం
  • రూ.3.42లక్షలు, ద్విచక్ర వాహనం అందజేత

షాద్‌నగర్‌: ఉన్న ఒక్క కొడుకు కళ్ల ముందే కరోనాతో కన్ను మూ శాడు. మాకు దిక్కెవరంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుం టే.. నేనున్నానంటూ ‘హలో షాద్‌నగర్‌’ ఆప్యాయంగా పలకరించింది.  కొడుకుపోయిన దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులపై  వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ ఎండీ ఖాజాపాషా తెలియపర్చాడు. దీనికి తో టి వారు స్పందించి మూడురోజుల్లోనే రూ.3.42లక్షలు అందజేయడం తో పాటు రూ.60వేలు విలువ చేసే ద్విచక్ర వాహనాన్నీ సమకూర్చా రు. దాతల సాయాన్ని మంగళవారం ఎంపీడీవో శరత్‌బాబు, ఎండీ ఖాజాపాషా, సామాజికవేత్త గంగిరెడ్డి, షాద్‌నగర్‌ ఆంధ్రజ్యోతి విలేకరి మోహన్‌రెడ్డి తదితరులు.. మృతిచెందిన విలేకరి గిరి తండ్రి మాదిరా జు సత్యనారాయణకు అందజేశారు. జడ్పీటీసీ వెంకట్‌రామ్‌రెడ్డి మా ట్లాడుతూ జర్నలి్‌స్టల సమస్యలను జడ్పీ సమావేశంలో ప్రస్తావించి గిరి తల్లిదండ్రులను ప్రభుత్వపరంగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వంగూరి గంగిరెడ్డి మాట్లాడుతూ నిరంతరం జర్నలి్‌స్టల సేవలు పొందుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఆపత్కాలంలో జర్నలి్‌స్టలకు అండగా నిలవాలని కోరారు. జర్నలిస్ట్‌ మోహన్‌రెడ్డి మా ట్లాడుతూ ఇలాంటి పరిస్థితి ఏ జర్నలిస్టుకూ రాకూడని ఆవేదన వ్య క్తం చేశారు. ఎంపీటీసీ భార్గవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ గిరి తల్లిదండ్రులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కార్మిక సంక్షేమ సం ఘం నేత ప్రభాకర్‌ మాట్లాడుతూ సేవలు చేసే వారిని పొగడకున్నా.. విమర్శలు మాత్రం చేయవద్దని సూచించారు. విరాళాలు అందజేసిన దాతలకు అడ్మిన్‌ అభినందనలు తెలిపారు.

కరోనా పేషెంట్ల కోసం అంబులెన్స్‌ వితరణ 

శంషాబాద్‌ రూరల్‌: కరోనాతో ఇబ్బంది పడుతున్న రోగుల సౌకర్యా ర్థం తమ వంతుసాయంగా రూ.4.61కోట్ల ఖరతో పది అంబులెన్స్‌లను వివిధ సంస్థలకు ఇచ్చామని కరూర్‌ వైశ్యా బ్యాంకు సీఈవో మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.రమే్‌షబాబు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తమ సీఎ్‌సఆర్‌ కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ర్టాలో పాటు, తమిళనాడులో పది అంబులెన్స్‌లను ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర వ్యా ప్తంగా కొవిడ్‌ రోగులను తరలించేందుకు 8 అంబులెన్స్‌లు, సాధారణ రోగులను తరలించేందుకు రెండు అంబులెన్స్‌లను చేయించి ఇచ్చా మని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ సుస్థిరత ప్రాజెక్టులకు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ మద్దతునిస్తోందని ఆయన చెప్పా రు. కార్యక్రమంలో వైశ్యా బ్యాంక్‌ మేనేజర్‌ కేవీఎం సుధాకర్‌, మేనేజర్‌ ఆర్‌.గణేశన్‌ తదితరులు పాల్గొన్నారు.

కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

తలకొండపల్లి: వెల్జాలలో కరోనా బాధితులకు కమల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి ఆదేశం మేరకు బీజేపీ నాయకులు హోంఐసోలేషన్‌ కిట్లు, నిత్యావసర సరుకులు, గుడ్లు అం దజేశారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్క్‌లు ధరి ంచి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సూరె డ్డి శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌, రాఘవేందర్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:06:18+05:30 IST