ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకురావాలి

ABN , First Publish Date - 2021-12-02T06:23:21+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహాయసహకారాలు అందించాలని ఎంఈవో గోపాల్‌రావు అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకురావాలి
మోతె మండలం సిరికొండ ప్రాథమిక పాఠశాలలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎంఈవో గోపాల్‌రావు

మోతె, డిసెంబరు 1:  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహాయసహకారాలు అందించాలని ఎంఈవో గోపాల్‌రావు అన్నారు. మండలంలోని సిరికొండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన అక్కినెపల్లి శ్రీశైలం తన సొంత డబ్బుతో  మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను నిర్మించారు. ఈ వాటర్‌ ప్లాంట్‌ను ఎంఈవో బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీశైలంను ఉపా ధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నూకల శ్రీనివాస్‌రెడ్డి, మందడి శివరంజన్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రజియా బేగం, ఉపాధ్యాయులు లింగానాయక్‌, లాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

దాతల సహకారం అభినందనీయం: ఎంఈవో సలీం షరీఫ్‌

 కోదాడ రూరల్‌, డిసెంబరు 1: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అభినందనీయమని ఎంఈవో సలీం షరీఫ్‌ అన్నారు. విజయీభవ ట్రస్టు ద్వారా దేవరశెట్టి బ్రహ్మయ్య మండలంలోని కూచిపూడి తండా ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.25 వేల విలువైన ఆఫీస్‌ టేబుల్‌, గ్రామపెద్ద దాచేపల్లి వీరయ్య రూ.3 వేల విలువైన కుర్చీ, డాక్టర్‌ సైదాశ్యామల రూ.6వేల విలువైన స్టడీ మెటీరియల్స్‌, నోటు పుస్తకాలు, స్టేషనరీ సమకూర్చారు. వీటిని పాఠశాలలో హెచ్‌ఎం రామ కోటేశ్వరరావుకు ఎంఈవో బుధవారం అందజేసి మాట్లాడారు.  ఈ సంద ర్భంగా దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సైదా, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రామకృష్ణ, మోతిలాల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:23:21+05:30 IST