నిరుద్యోగులను విస్మరిస్తే ఉద్యమబాటే..!

ABN , First Publish Date - 2021-08-02T06:31:14+05:30 IST

నిరుద్యోగులను విస్మరిస్తే రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ సమీకరించి ఉద్యమబాట పడతామని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు అన్నారు.

నిరుద్యోగులను విస్మరిస్తే ఉద్యమబాటే..!

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు 

కందుకూరు, ఆగస్టు 1: నిరుద్యోగులను విస్మరిస్తే రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ సమీకరించి ఉద్యమబాట పడతామని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. ఆ సంఘం కందుకూరు నియోజకవర్గ 3వ మహాసభలు ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజేంద్రబాబు మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేయడంలో పోటీపడుతున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ప్రధాని పదవి చేపట్టిన అనంతరం అదానీ, అంబానీ సేవలో తరిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పరిశ్రమలు మూతపడి కోట్లాది మంది నిరుద్యోగులుగా మారారన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగులుగా ఉన్నవారిని నిరుద్యోగులుగా మార్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన రెడ్డి పరిపాలన నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందన్నారు. ఆయన అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా ఒక్క పరిశ్రమను స్థాపించింది లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో అభివృద్ధికి విఘాతం కలిగించారన్నారు. ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఆనంద్‌మోహన్‌ మాట్లాడుతూ జగన్‌ పాలన మోసపూరితంగా జరుగుతున్నదన్నారు. తప్పుడు లెక్కలతో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ని సవరించి నిజమైన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించేవరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్‌ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చేవూరి దుర్గాప్రసాద్‌, కార్యదర్శిగా బి.చంద్రమోహన్‌లను మరో 27మందితో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.మాలకొండయ్య, సీనియర్‌ నాయకుడు పి. బాలకోటయ్య, ఎస్‌. రావమ్మ, బి.సురే్‌షబాబు, కలవకూరి హరిబాబు, నారాయణ మ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T06:31:14+05:30 IST