పుకార్లను నమ్మొద్దు

ABN , First Publish Date - 2021-06-18T05:58:29+05:30 IST

తాను టీఆర్‌ఎ్‌సను వీడి బీజేపీలోకి చేరుతున్నట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ఎంపీ బీబీ పాటిల్‌ తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్‌ నియోజకర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.

పుకార్లను నమ్మొద్దు
కల్హేర్‌లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

బీజేపీలో చేరుతున్నట్లు నాపై అసత్య ప్రచారం

పుకార్లను పుట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం : ఎంపీ బీబీ పాటిల్‌

బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో లక్షా 31 ఎకరాలకు సాగు నీరు

రైతుల ఆర్థిక పరిపుష్టికి అధిక ప్రాధాన్యం : ఎంపీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


నారాయణఖేడ్‌/మనూరు/కల్హేర్‌, జూన్‌ 17 : తాను టీఆర్‌ఎ్‌సను వీడి బీజేపీలోకి చేరుతున్నట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ఎంపీ బీబీ పాటిల్‌ తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్‌ నియోజకర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. మనూరు మండలం బోరంచలోని మంజీర నది పరీవాహక ప్రాంతంలో నిర్వహిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను గురువారం ఎంపీ బీబీ పాటిల్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై కొందరు సోషల్‌ మీడియాలో బీజేపీలో చేరుతున్నట్లు చేస్తున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఈ మాటలు ప్రజలు నమ్మొద్దని ఎంపీ కోరారు. పుకార్లు పుట్టిస్తున్న వారిని గుర్తించి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. తాను టీఆర్‌ఎ్‌సతోనే రెండుసార్లు ఎంపీగా గెలుపొంది, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్నానని చెప్పారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో బీడు భూములకు సాగునీరు అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంపీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో లక్షా 31 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎత్తిపోతలకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం నారాయణఖేడ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో, కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. సిర్గాపూర్‌ మండలంలోని బొక్క్‌సగామ్‌లో గ్రామపంచాయతీ నూతన భవనం, శ్మశానవాటికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆర్థిక పరిపుష్టికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ఖేడ్‌ ప్రాంతంలో జొన్న పంటను అధికంగా సాగుచేస్తారని, అందువల్ల సీఎం ఈ ప్రాంత రైతుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా జొన్నల కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీలు రాజురాథోడ్‌, లక్ష్మీబాయిరవీందర్‌, నర్సింహారెడ్డి రాఘవరెడ్డి, ఎంపీపీలు కొంగరి జయశ్రీమోహన్‌రెడ్డి, చాందిబాయి, గుర్రపు సుశీల, జారా మహిపాల్‌రెడ్డి, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్‌,  డీసీసీబీ డైరెక్టర్లు ఎం.నరేందర్‌రెడ్డి, గుండు వెంకట్‌రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే చరిత్రాత్మమైన ఖేడ్‌ రాంమందిర్‌ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హాజరై పాలకవర్గాన్ని అభినందించారు. రాంమందిర్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ముత్యం హన్మండ్లు, డైరెక్టర్లుగా సాయిరి రాంమందర్‌, పాండు, తుకారాం, విజయలక్ష్మితో పాటు పురోహితులు రావిచెట్టు శ్రీప్రసాద్‌చే కార్యనిర్వహణ అధికారి మోహన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌ అప్పారావుషెట్కార్‌ కూడా పాలకవర్గం సభ్యులను సన్మానించారు. 

Updated Date - 2021-06-18T05:58:29+05:30 IST