విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా..?

ABN , First Publish Date - 2022-09-13T05:11:22+05:30 IST

ప్రభుత్వ పాఠ శాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా అని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేష్‌ ప్రశ్నించారు.

విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా..?
పాత కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు

వనపర్తి టౌన్‌, సెప్టెంబరు 12: ప్రభుత్వ పాఠ శాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా అని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేష్‌ ప్రశ్నించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని పాత కలెక్టర్‌ కార్యాలయం ముందు పీడీఎస్‌ యూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం నూతన కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపా ధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశా లల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పాఠశాల, కళాశాల విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెరుగుతు న్న ధరలకు అనుగుణంగా చెల్లించాలన్నారు.   మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమం లో పురుషోత్తం, మోహన్‌, రాజు, శేఖర్‌, రాజేందర్‌, సందీప్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-13T05:11:22+05:30 IST