వీటిని కలిపి తినవద్దు!

ABN , First Publish Date - 2020-02-04T16:59:49+05:30 IST

పొత్తు కుదరని పదార్థాలు కలిపి తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. పుల్లని త్రేన్పులు,

వీటిని కలిపి తినవద్దు!

పొత్తు కుదరని పదార్థాలు కలిపి తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. పుల్లని త్రేన్పులు, కడుపు ఉబ్బరం, అపానవాయువు లాంటి ఇబ్బందులూ తప్పవు. ఇలా జరగకుండా ఉండాలంటే కలిపి తినకూడని పదార్థాలేవో తెలుసుకుని, జాగ్రత్తపడాలి!

మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, వెన్న లేదా మీగడ కలిపి తినకూడదు. అలాగే పాలు, గుడ్లు కలిపి తినకూడదు.పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణకోశంలో వాయువులు తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పండ్లు ఖాళీ కడుపుతో తినాలి. పండ్లు తిన్న రెండు గంటల తర్వాతే ఇతర పదార్థాలు తీసుకోవాలి.

చల్లని, వేడి పదార్థాలు వెంటవెంటనే తీసుకోకూడదు. పెరుగు, కాఫీ, లేదా ఐస్‌క్రీమ్‌, టీ... ఇలా రెండూ వెంటవెంటనే తీసుకోకూడదు. అలాగే భోజనం చేసే సమయంలో చల్లని నీరూ తాగకూడదు. ఇలా చేస్తే జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ కుంటుపడుతుంది.

తేనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి పదార్థాల్లో కలిపి తినకూడదు. టీలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటాం. కొందరు పాలలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా వేడి పదార్థాల్లో తేనెను కలిపినప్పుడు తేనెలో కలిసి ఉండే మైనం విషంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పద్ధతిని మానుకోవాలి.

Updated Date - 2020-02-04T16:59:49+05:30 IST