ఆర్మీని రంగంలోకి దింపేలా చేయద్దు: అజిత్ పవార్ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-03-27T00:32:16+05:30 IST

ఆర్మీని రంగంలోకి దింపేలా చెయద్దని ప్రజలను హెచ్చరించిన అజిత్ పవార్

ఆర్మీని రంగంలోకి దింపేలా చేయద్దు: అజిత్ పవార్ హెచ్చరిక

ముంబై: కరోనా ఆంక్షలని అమలు చేయడం ప్రభుత్వాలకు కష్టంగా మారుతోంది. ఎంతగా హెచ్చిరించినప్పటికీ ఇంకా అనేక మంది లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోవట్లేదు. లాక్ డౌన్ ప్రారంభమై రెండు రోజులు అవుతున్నప్పటికీ ప్రజలు ఈ కొత్త పరిస్థితికి అలవాటు పడలేకపోతున్నారు. వారి కున్న ఇబ్బందులు అలాంటివి మరి. ఎవరినీ తప్పుపట్టలేని పరిస్థితి. అయితే రాష్ట్రాలకు ఇది ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.


ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. షూట్ ఎట్ సైట్ పరిస్థితులు తెచ్చుకోవద్దంటూ ప్రజలను కాస్తంత గట్టిగానే హెచ్చిరించారు. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి కూడా అదే తీరులో స్పందించారు. ‘సభ్యులకు అత్యవసర వస్తువులు ఎలా సమకూర్చాలనే దానిపై కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీలు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలి. అమెరికాలో అయితే ప్రజల రోజూవారి జీవితం ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడ కూడ ఆర్మీ దింపేలా మమ్మల్ని వివసుల్ని చేయద్దు’ అని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సూటిగా చెప్పారు.  


Updated Date - 2020-03-27T00:32:16+05:30 IST