అనర్హులకు ఇళ్లు ఇస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2022-09-07T04:58:43+05:30 IST

అనర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తే ఊరుకోబోమని అలంపూర్‌ మండలంలోని క్యాతూరు గ్రామస్థులు రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనర్హులకు ఇళ్లు ఇస్తే ఊరుకోం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

- రెవెన్యూ అధికారులపై క్యాతూరు గ్రామస్థుల ఆగ్రహం

అలంపూర్‌ చౌరస్తా 6 : అనర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తే ఊరుకోబోమని అలంపూర్‌ మండలంలోని క్యాతూరు గ్రామస్థులు రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం 20 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. వాటిని కేటాయిం చేందుకు అధికారులు 45 మంది అర్హుల జాబితా ను సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపిం చారు. జాబితాను ఆమోదించేందుకు రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో నలుగురు మాత్రమే అర్హులని తెలిపారు. మిగతా వారు అనర్హులని, వారికి కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సుభాష్‌ నాయుడు మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితాపై కలెక్టర్‌ ఆదేశం మేరకు గ్రామసభ నిర్వహించామని తెలిపారు. జాబితాలో అనర్హులు ఉన్నారని గ్రామస్థులు తమ దృష్టికి తేవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. 

Updated Date - 2022-09-07T04:58:43+05:30 IST