ప్రైవేటు పాఠశాలకు అనుమతులు ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2022-07-05T04:28:45+05:30 IST

గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యని, గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలకు అనుమతులు ఇవ్వొద్దని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

ప్రైవేటు పాఠశాలకు అనుమతులు ఇవ్వొద్దు
కిచెన్‌ షెడ్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

వనపర్తి రూరల్‌, జూలై 4: గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యని, గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలకు అనుమతులు ఇవ్వొద్దని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. వనప ర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామం, ప్రాథమిక పాఠశాలలో సోమవారం కిచెన్‌ షెడ్‌ నిర్మాణానికి ఆ యన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిచెన్‌ షెడ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్లను, పాఠశాల తరగతి గదులను తనిఖీ చేశారు. చిన్నారులను ఖాళీ గా కూర్చొనివ్వకుండా ఏదో ఒక అక్షరాన్ని రాయించా లని సూచించారు. పిల్లల్లో సృజనాత్మకత శక్తి పెంచాలంటే ఆటలు, పాటలు నేర్పించాలని అన్నారు.  త్వరలోనే అంగన్‌వాడీ టీచర్లకు ఆటలు, పాటలపైన శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో  ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని అన్నారు. గ్రామంలో ఉండే అన్ని అంగన్‌వాడీ సెంటర్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ కిచ్చారెడ్డి,  సర్పంచ్‌ కొండన్న, ఎంపీటీసీ కురు మూర్తి, అంగన్‌వాడీ టీచర్లు ఉమా, అరుణ, ఉపా ధ్యాయ సిబ్బంది జితేంద్ర, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకు లు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-05T04:28:45+05:30 IST