Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేయసిని అంత్యక్రియలకు రానివ్వకండి. నా శవాన్ని కూడా చూడనీయొద్దు.. అంటూ ఆ కుర్రాడు లేఖ రాసి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: ‘‘నా అంత్యక్రియలకు ప్రియురాల్ని రానివ్వకండి’’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టిన ఆ యువకుడు.. అర్ధరాత్రి కుటుంబం మొత్తం నిద్రిస్తుండగా ఉరిపోసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది. స్థానికంగా జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న గోపాల్ అనే యువకుడు జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయాన్నే నిద్ర లేచిన గోపాల్ సోదరుడు నితేష్.. అన్నను నిద్రలేపుదామని వెళ్లాడు. తీరా చూస్తే అన్న ఫ్యానుకు ఉరేసుకొని కనిపించాడు. దీంతో ఆందోళన చెందిన నితేష్.. అన్నను వెంటనే ఆస్పత్రికి తరించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. గోపాల్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. గోపాల్ గదిలో నుంచి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో తన బాబాయ్ కూతుళ్లకు తన మొహం కూడా చూపించొద్దని కోరిన గోపాల్.. తన ప్రేయసిని అంతిమ సంస్కారాలకు రానివ్వొద్దని వేడుకున్నాడు. ఇదే తన ఆఖరి కోరిక అని, ఇది తీరకపోతే తన ఆత్మకు శాంతి లభించదని అన్నాడు. అయితే బాబాయ్‌కి సంబంధించిన ఆస్తి కేసులో వాళ్ల కుమార్తెలతో గోపాల్ కుటుంబానికి గొడవలు జరుగుతున్నాయని ఆ కుటుంబం చెప్తోంది. తన చెల్లెళ్లపై గోపాల్ చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంగా ఏ ఉద్యోగం చేయని గోపాల్.. తన సంతోషంగా ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement