Apr 22 2021 @ 00:59AM

మహిళల ఫీలింగ్స్‌కి గౌరవం ఇవ్వరు!

‘‘ఈతరానికి అవసరమైన సందేశాత్మక చిత్రమిది. సమాజంలో మహిళల ఫీలింగ్స్‌కి గౌరవం ఇవ్వరు. అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చూశా. నగరాలు, పట్టణాల్లోనైనా, పల్లెలోనైనా... ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి’’ అంటున్నారు ఐశ్వర్యా రాజేశ్‌. ఓటీటీ వేదికలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకున్న మలయాళ చిత్రం ‘ద గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ తమిళ రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మాట్లాడుతూ ‘‘సాధారణంగా రీమేక్‌ చేయడం కష్టం. మాతృకలో ఆత్మ, భావం మిస్‌ కాకుండా చూడటం కష్టం. ఆ కారణం చేతనే కొన్ని రీమేక్‌లకు నేను నో చెప్పా. కానీ, ‘ద గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పా. ఎందుకంటే... ఈతరానికి అవసరమైన చిత్రమిది’’ అన్నారు.