సమస్యలు వచ్చినప్పుడే చాంబర్లు గుర్తొస్తాయా?

ABN , First Publish Date - 2020-02-22T06:52:03+05:30 IST

పారిశ్రామిక చాంబర్ల (సంఘాలు)ను తేలిగ్గా తీసుకోవద్దని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సూచించారు

సమస్యలు వచ్చినప్పుడే చాంబర్లు గుర్తొస్తాయా?

  • వ్యాపారవేత్తలను ప్రశ్నించిన పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: పారిశ్రామిక చాంబర్ల (సంఘాలు)ను తేలిగ్గా తీసుకోవద్దని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సూచించారు. చాలా మంది వ్యాపారవేత్తలు తమకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పారిశ్రామిక సంఘాలను ఆశ్రయిస్తున్నారని, మిగతా సందర్భాల్లో పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఫిక్కీ, అసోచామ్‌లు నిర్వహించే కార్యక్రమాల్లో కేవలం ప్రస్తుత అధ్యక్షుడు, కొంత మంది పూర్వ అధ్యక్షులు, రాబోయే అఽధ్యక్షులు, కొంత మంది ఆఫీస్‌ బేరర్లు మాత్రమే కనిపిస్తుంటారని ఆయన చెప్పారు. జాతికి ఎంతో ముఖ్యమైన వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార వర్గాలు ఎక్కడున్నారు అని ఆయన ప్రశ్నించారు. 


శుక్రవారంనాడిక్కడ జరిగిన ఏఐఎంఏ సమావేశంలో పీయూష్‌ గోయల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సందేశాన్ని మీ సహచరులు, స్నేహితుల దృష్టికి తీసుకువెళ్లాలని ఏఐఎంఏ ప్రెసిడెంట్‌ సంజయ్‌ కిర్లోస్కర్‌, మాజీ అధ్యక్షుడు హర్ష్‌పతి సింఘానియాలకు సూచించారు. అసోసియేషన్లను తక్కువగా తీసుకోవద్దని కూడా వారికి తెలియజేయాలన్నారు. మీకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వెళ్లడానికి పారిశ్రామిక సంఘాలు లేవన్నారు. ఈ సందర్భంగా గోయల్‌ ఒక ఉదాహరణను పారిశ్రామికవర్గాలతో పంచుకున్నారు. ప్రభుత్వం బొమ్మలపై దిగుమతి సుంకాలను పెంచాలని నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో బొమ్మల పరిశ్రమ సూపర్‌ యాక్టివ్‌ అయిందని అన్నారు. 

Updated Date - 2020-02-22T06:52:03+05:30 IST