ధాన్యం రవాణా దిగుమతిలో దోపిడీ

ABN , First Publish Date - 2021-05-09T05:00:18+05:30 IST

ప్రభుత్వం తరపున ఏర్పాటైన ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం లారీల నుంచి కేటాయించిన మిల్లులకు(రవాణా)దిగుమతి చేసే సమయంలో బాధిత రైతుల ధాన్యం మాయానికి గురైంది.

ధాన్యం రవాణా దిగుమతిలో దోపిడీ

 ఒకే లారీలో రెండుటన్నుల ధాన్యం మాయం 

 బాధిత రైతుల గగ్గోలు

కల్లూరు, మే 8: ప్రభుత్వం తరపున ఏర్పాటైన ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం లారీల నుంచి కేటాయించిన మిల్లులకు(రవాణా)దిగుమతి చేసే సమయంలో బాధిత రైతుల ధాన్యం మాయానికి గురైంది. దీంతో ఆయా రైతులు గగ్గోలు పెడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామంలోగల ఐకేపీ కేంద్రంలో బీరల్లి లక్ష్మారెడ్డి, బీరల్లి అనంత్‌రెడ్డిలకు సంబంధించిన 32.275టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈనెల ఐదోతేదీన కల్లూరులోని శ్రీకృష్ణ వేబ్రిడ్జి వద్ద కాంటా వేసి ట్రాన్స్‌ఫోర్టుకు సంబంధించి గుత్తేదారు పంపిన లారీలో కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లిలోని రైస్‌మిల్లుకు పంపించారు. సదరు మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకొనే సమయంలో రెండోవిడతగా అక్కడ వేబ్రిడ్జిలో ధాన్యం లోడింగ్‌ లారీని మిల్లు యజమాని కాంటా వేయించగా 30.615టన్నుల ధాన్యం మాత్రమే నికరంగా చూపించింది. దీంతో లారీలో లోడింగ్‌ అయిన ధాన్యంకు సంబంధించి రూ.40వేల విలువగల రెండు టన్నుల ధాన్యం మాయమైనట్లు తేడా చూపించింది. ధాన్యం దిగుమతిలో పైవిధంగా వ్యత్యాసం ఉందని సదరు మిల్లు యజమాని ఐకేపీ కేంద్రం నిర్వాహాకుల ద్వారా రైతులకు సమాచారం అందించగా వారు అవాక్కయ్యారు. సర్పంచ్‌ బైరెడ్డి నర్సింహారెడ్డి చొరవతో ఇక్కడి నుంచి రవాణా అయిన ధాన్యంలో అక్కడ మిల్లుల సీసీ పుటేజీలను తెప్పించి పరిశీలించగా సదరు మిల్లులు పైవిధంగా 40బస్తాల ధాన్యం మాయమైనట్లు పుటేజీల్లో చూపించింది. ఈ విషయమై మిల్లు యజమానిని బాధిత రైతులు ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పాడు. ట్రాన్స్‌ఫోర్టు లారీ యజమానిదేనని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం జరిగింది. పైవిధంగా రెండు టన్నుల ధాన్యం మాయమైన విషయమై సదరు గుత్తేదారుడిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం జరిగిందన్నారు. పైవిధంగా జరిగిన సంఘటనపై ఐకేపీ నిర్వాహాకుల దృష్టికి కూడా తీసుకువచ్చామని, ధాన్యం మాయమైన విషయమై తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-05-09T05:00:18+05:30 IST