Abn logo
Sep 28 2021 @ 22:44PM

చుక్కల భూముల పరిశీలన

జోరేపల్లి గ్రామంలోని తోటలో చుక్కల భూములను పరిశీలిస్తున్న జేసీ హరేందిర ప్రసాద్‌

రాపూరు, సెప్టెంబరు 28: మండలంలోని జోరేపల్లి, తెగచెర్ల గ్రామాల్లోని రైతుల చుక్కల భూములను జేసీ హరేందిర ప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు. ఆ గ్రామాల్లోని రైతుల పంట పొలాలు, తోటలు చుక్కల భూములుగా రికార్డుల్లో ఉండడంతో క్రయ, విక్రయాలకు  ఇబ్బందిగా మారింది.  రికార్డుల్లో చుక్కల భూములుగా ఉన్న తమ పట్టా భూములను ఆ మేరకు నమోదు చేయాలని వినతులు సమర్పించడంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి సందర్శించి విచారించారు. ఆయన వెంట తహసీల్దారు వరకుమార్‌ ఉన్నారు.