Abn logo
Oct 15 2021 @ 01:42AM

స్థలం ఉన్న అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

నూకపల్లిలో డబుల్‌ ఇళ్లు ప్రారంభిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

అంచెలవారీగా అన్ని ప్రాంతాల్లో దళితబంధు 

రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌

మల్యాల, అక్టోబరు 14: డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, స్థలం ఉన్న వారికి డబుల్‌ఇళ్లు మంజూరు చేయాలనే ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఉన్న అర్హులైన వారందరికీ డబుల్‌ఇళ్లు ఇవ్వడానికి నిర్ణయించినట్లు రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మల్యాల మండలం నూకపల్లి, రామన్నపేట, పోతారం గ్రామాల్లోని పేదలకు నిర్మించిన 63 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ఇళ్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతేడాది డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల కోసం ప్రభుత్వం రూ. 11వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. వినూత్న పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అలాగే అంచెల వారీగా రాష్ట్రమంతా దళితబంధు పథకం అమలు చేసి దళితులు అన్ని రంగాలలో ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గానికి త్వరలోనే 2వేల డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జి.రవి, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, ఆర్డీవో మాధురీ, ఎంపీపీ మిట్టపెల్లి విమల, జడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్‌ రావు, జడ్పీ కోఆప్షన్‌ ఎం.డీ సుబాన్‌, ఏఎంసీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్‌, సర్పంచ్‌లు మారంపెల్లి సరోజ, గడ్డం జలజ, రాసమల్ల హరీశ్‌, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.