Abn logo
Sep 19 2021 @ 04:05AM

హర్మిలన్‌కు ‘డబుల్‌’

  • జాతీయ అథ్లెటిక్స్‌

జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పంజాబ్‌ స్టార్‌ హర్మిలన్‌ కౌర్‌ మళ్లీ మెరిసింది. ఇప్పటికే టోర్నీలో 1500 మీటర్ల రేసు నెగ్గిన హర్మిలన్‌.. శనివారం పోటీల్లో 800 మీటర్లలోనూ చాంపియన్‌గా నిలిచి ’డబుల్‌’ సాధించింది. ఇక, లాంగ్‌జంప్‌లో 6.52 మీటర్లు లంఘించి స్వర్ణం గెలిచిన రైల్వేస్‌ అథ్లెట్‌ ఐశ్వర్య.. ట్రిపుల్‌ జంప్‌లో 13.55 మీటర్ల ప్రదర్శనతో రెండో పసిడి దక్కించుకుంది. పురుషుల 800 మీటర్లలో అఫ్సాల్‌, పోల్‌వాల్ట్‌లో శివ, హెప్టాథ్లాన్‌లో అక్షత, జావెలిన్‌ త్రోలో సౌమ్యా మురుగన్‌ విజేతలుగా నిలిచారు. పోటీలకు ఆదివారం చివరిరోజు.