Abn logo
Feb 24 2021 @ 23:39PM

నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకడానికే ‘డబుల్‌’ ఇళ్లు

చల్‌గల్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌

- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల రూరల్‌, ఫిబ్రవరి 24: నిరుపేద లు ఆత్మగౌరవంతో బతకడానికే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. బుధ వారం జగిత్యాల రూరల్‌ మం డ లంలోని చల్‌గల్‌లో జీపీ నిధులు 40 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత శంకుస్థాపన చేశారు. అనం తరం చల్‌గల్‌లో తుది దశలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లా డుతూ ఇదివరకే తిప్పన్నపేట, ధరూర్‌, నర్సింగాపూర్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. త్వర లో లక్ష్మీపూర్‌, తిమ్మపూర్‌ గ్రామాల్లో అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌  దావ వసం త, ఎంపీపీ గంగా రాంగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సం దీప్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా యూత్‌ అధ్యక్షుడు దావ సురే ష్‌, సర్పంచ్‌ గంగనర్సు రాజన్న, బాలముకుందం, మో హన్‌రెడ్డి, షకీల్‌, ఫయాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement