భగ్గుమంటున్న కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2021-05-06T05:37:26+05:30 IST

మండల కేంద్రంలో జరిగే వారపు సంతలో కూరగాయలు రేట్లు భగ్గు మంటున్నాయి.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు
కూరగాయలు కొంటున్న ప్రజలు

  1. ఇబ్బంది పడుతున్న ప్రజలు


ఉయ్యాలవాడ, మే 5: మండల కేంద్రంలో జరిగే వారపు సంతలో కూరగాయలు రేట్లు భగ్గు మంటున్నాయి. కర్ఫ్యూ కారణంగా వ్యాపారులు కూరగాయల ధరలను అమాంతంగా పెంచేశారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితుల్లో లేరు. బీరకాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్టు, బీట్‌రూట్‌ (కిలో)రూ. 60 కాగా వంకాయ, బెండకాయ, మట్టికాయ, తదితర కూరగాయలు రూ. 40 పలుకుతున్నాయి. ప్రతి బుధవారం గ్రామ పోలీసు స్టేషన్‌ సమీపంలో వారపు సంత జరిగేది. కర్ఫ్యూ కారణంగా బుధవారం స్థానిక ఉన్నత పాఠశాలలో సంత ఏర్పాటు చేశారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి ధరలను అదుపుచేయాలని ప్రజలు కోరుతున్నారు.


ధరలను అదుపు చేయాలి

కర్ఫ్యూ కారణం చూపి వ్యాపారులు కూరగాయల ధరలను అమాంతంగా పెంచేశారు. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ. 40 పైనే ఉన్నాయి. బుధవారం నుంచి కూరగాయలను పెంచేశారు. 

- సుబ్బరాయుడు, ఉయ్యాలవాడ

Updated Date - 2021-05-06T05:37:26+05:30 IST