ఒక్క మాస్క్ ఎన్ని గంటలు ధరించాలో తెలుసా...!?

ABN , First Publish Date - 2021-05-09T17:39:07+05:30 IST

మాస్క్‌ అలంకార ప్రాయంగా కాకుండా ముక్కు, నోరు పూర్తిగా...

ఒక్క మాస్క్ ఎన్ని గంటలు ధరించాలో తెలుసా...!?

- డబుల్ మాస్క్ సేఫ్

- రెండు మాస్క్‌లు వేసుకుంటేనే మనుగడ

- వైరస్‌ ఉధృతి వేళ నిర్లక్ష్యం తగదు

- ఆరుగంటల తర్వాత మాస్క్‌ శుభ్రపరచాల్సిందే 

- కొవిడ్‌ సాంకేతిక సలహా సమితి సూచన


బెంగళూరు: కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో ప్రబలుతోందని డబుల్‌ మ్యూటెడ్‌ వైర్‌సగా రూపాంతరం చెంది ప్రజల ఊపిరి తిత్తులలో చేరి ప్రాణవాయువు అందకుండా అవుతోందని ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ డబుల్‌ మాస్క్‌ వేసుకోవాలని కొవిడ్‌ సాంకేతిక సలహా సమితి సూచించింది. వైరస్‌ తీవ్రతను తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కరోనా కర్ఫ్యూ’ నిర్వహించినప్పటికీ అది ఏమాత్రం ప్రయోజకరంగా లేకపోగా మరో పదిహేను రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. అయితే ప్రజలు మాత్రం ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ వేల కేసులు వస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తగా ఉన్న మాస్కును సక్రమంగా ధరించడంలేదు. ఏదో వేసుకోవాలంటే వేసుకొన్నట్టుగా ప్రజలు వ్యవహరిస్తుండడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రతి వ్యక్తి ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాటన్‌ మాస్క్‌, లేదా సర్జికల్‌ మాస్క్‌, ఎన్‌-95 ఇతరత్రా మాస్కులు కొంతవరకు రక్షణగా ఉన్నప్పటికీ దీనిద్వారా పూర్తిస్థాయిలో వైరస్‌ వ్యాపించకుండా ఉండడం లేదని అందువల్లే ఇప్పటికే డాక్టర్లు, వాలంటీర్లు, వారియర్స్‌ అం దరూ డబు ల్‌ మాస్కింగ్‌ ధరిస్తున్నారన్నారు. డబుల్‌ మాస్కింగ్‌ ద్వారా కొంతవరకు వైరస్‌ ప్రబలకుండా నియంత్రించవచ్చునని కమిటీ తమ పరిశోధనలో నిరూపితమైనట్లు తెలియజేస్తున్నారు. ఈ మేరకు నగర బీబీఎంపీ కమిషనర్‌ కూడా శనివారం ఒక సందర్భంగా డబుల్‌ మాస్క్‌ వేసుకోవడం శ్రే యస్కారమన్నారు. తద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకిరికి వ్యాపించడం చాలావరకు తగ్గుతుందన్నారు. ఒక సర్జిక ల్‌ మాస్క్‌, ఎన్‌-95 మాస్క్‌ లేదంటే కాటన్‌ మాస్క్‌ను జతచేసుకొని ధరించి తమను తాము రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించాలని సూచించారు. 


ఎలా వేసుకోవాలంటే.. 

మాస్క్‌ కేవలం ఒక కనీస జాగ్రత్త మాత్రమేనని 100 శాతం రక్షణ కవచంగా పనిచేయదని కమిటీ సూచించింది. ఇలాంటి ఏ మాస్క్‌ కూడా మార్కెట్‌లో లేదని వదంతులు నమ్మవద్దన్నారు. ఏదేని ఒక సర్జికల్‌ మా స్క్‌ లోపలి భాగాన, ఏదేని క్లాత్‌ మాస్క్‌ లేదా ఎన్‌-95 మాస్క్‌ బయటి వైపు ఉండేలా జత చేసి వేసుకోవాలని తెలియజేశారు. తద్వారా మనలోని వైరస్‌ బయటికి పోకుండా సర్జికల్‌ మాస్క్‌ రక్షణగా ఉంటే, బయటి వైరస్‌ మనలోకి రాకుండా ఎన్‌-95 మాస్క్‌ రక్షణ కల్పిస్తుందని సమితి వివరించింది. ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తు లు, ప్రభుత్వాధికారులు, హెల్త్‌ వర్కర్స్‌, డెలివరీ బాయ్స్‌ తదితరులు ఇతురులతో తరచూ సంభాషణలు చేసేవారు తప్పకుండా డబుల్‌ మా స్క్‌ వేసుకోవాలన్నారు. అదేవిధం గా హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు, వారికి సహాయకులుగా ఉన్న ఎవరైనా డబుల్‌ మాస్కింగ్‌ చేసుకుంటే ఎంతో ఉత్తమని చెబుతున్నారు. 


ఒక్క మాస్క్‌ ఆరుగంటలు మాత్రమే ధరించాలి.. 

ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితి కారణంగా రాష్ట్రంలో కనీసం ఒక సంవత్సరం వరకు మాస్కులు వేసుకోవాల్సి ఉందని అయితే ఒక్క మాస్క్‌ 6 గంటల కాలం మాత్రమే వేసుకోవాలని సమితి పేర్కొంది. మాస్క్‌ అలంకార ప్రాయంగా కాకుండా ముక్కు, నోరు పూర్తిగా మూసుకొనే విధంగా ఉన్న డబుల్‌ మాస్కులను ధరించాలన్నారు. ఎలాంటి మాస్క్‌ వాడినప్పటికీ కేవలం 6 గంటలు మాత్రమే ఉపయోగించాలని ఆ తర్వాత దానిని క్రమపద్దతిలో కడిగి మళ్ళీ ఉపయోగించాలన్నారు. వేడినీటిలో సర్క్‌ ద్వారా కిడిగి ఎండలోనే ఎండించి తర్వాత  ఉపయోగించాలన్నారు. ఈ నియమ నిబంధనలు పాటిస్తే తప్ప వైరస్‌ ఒకరి నుం చి మరొకరికి ప్రబలకుండా ఉంటుందని లేకపోతే పరిస్థితిని ఏ ప్రభుత్వం కూడా నియంత్రించలేదన్నారు. ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాలన్నారు. ప్రజలే చైతన్యవంతులై ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని, ప్రభుత్వానికి అన్నివిధాలా ప్రజలు సహకరిస్తేనే కొ విడ్‌ మహమ్మారిని పార ద్రోలడానికి వీలుంటుందని సలహా సమితి పేర్కొంది. 

Updated Date - 2021-05-09T17:39:07+05:30 IST