చట్టాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి : అమిత్‌షా

ABN , First Publish Date - 2021-01-17T21:19:16+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలూ రైతులకు మేలు చేసేవేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు.

చట్టాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి : అమిత్‌షా

బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలూ రైతులకు మేలు చేసేవేనని  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. ఆ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. కర్నాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొన్నారు. ‘‘రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నూతన చట్టాలు మూడూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి. వీటితో దేశంలో ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకోవచ్చు. వీటికి అనుగుణంగా యడియూరప్ప ప్రభుత్వం కూడా చట్టాన్ని తెచ్చింది. అందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా.’’ అని షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు క్షేమం కోసం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ను పెంచుతూనే ఉన్నామని, వివిధ రకాలైన పంటలకు కనీస మద్దతు ధరను కూడా పెంచినట్లు అమిత్‌షా తెలిపారు. 

Updated Date - 2021-01-17T21:19:16+05:30 IST