యూట్యూబ్‌ నుంచి వీడియో డౌన్‌లోడింగ్‌ సులువే

ABN , First Publish Date - 2021-08-21T08:12:04+05:30 IST

ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్‌ను చూడని నెటిజన్‌ ఉండడంటే అతిశయోక్తి ఏమీ కాదు. రెండు

యూట్యూబ్‌ నుంచి వీడియో డౌన్‌లోడింగ్‌ సులువే

ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్‌ను చూడని నెటిజన్‌ ఉండడంటే అతిశయోక్తి ఏమీ కాదు. రెండు బిలియన్లకు మించి నెలవారీ యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక మంది విజిట్‌ చేసే రెండో వెబ్‌సైట్‌గా పేరొందింది. రోజుకు బిలియన్‌ గంటల మేర వీడియోలు స్ట్రీమ్‌  అవుతుంటాయి. మొబైల్‌ వినియోగదారులు తమ వీక్షణ సమయంలో 40 శాతం దీనికే కేటాయిస్తున్నారన్నది ఒక లెక్క. అయితే యూట్యూబ్‌ ప్రీమియమ్‌ లేని పక్షంలో కొన్ని వీడియోలను డౌన్‌లోడ్‌ చేయలేరు. ఇందులో కొన్ని మ్యూజిక్‌ వీడియోలు కూడా ఉంటాయి. అయితే కొన్ని పద్ధతులు పాటిస్తే వీడియోల డౌన్‌లోడింగ్‌ సులువే. అయితే అందుకు థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్స్‌, టూల్స్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. 


స్మార్ట్‌ ఫోన్‌లో రెగ్యులర్‌గా యూట్యూబ్‌ చూసే వ్యక్తులు కావాల్సిన కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం సహజం.  నెట్‌ కనెక్టివిటీ లేనప్పుడు అవే ఉపయోగపడతాయి. అందుకు కింది కొన్ని యాప్స్‌ను వినియోగించుకోవాలి.  


న్యూపైప్‌: ఇది పాపులర్‌ ఓపెన్‌ సోర్స్‌. పారదర్శకత కలిగిన యాప్‌లు ఇవి. అక్కర్లేని ప్రకటనలు, అనుచిత సిఫార్సులు, అనవసరమైన నేపథ్యం సంగీతం వంటి బాధలు ఉండవు. 1080పి, 2కె, 4కె ఉన్నవి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సబ్‌టైటిల్స్‌, ప్లేలిస్ట్స్‌ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. యాప్‌లోనే వ్యూ హిస్టరీని సైతం చూసుకోవచ్చు. 


వై2 మేట్‌ డౌన్‌లోడర్‌

దీన్ని ఉపయోగించుకుని కూడా వీడియోలను సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ ఇన్‌స్టలేషన్‌ లేదంటే సాఫ్ట్‌వేర్‌ ట్వీక్స్‌ అవసరం  కూడా ఉండదు. చాలా సూటిగా ఉండే వెబ్‌సైట్‌ ఇది. లింక్‌ను కాపీ చేసి వీడియోను పొందవచ్చు. ప్రత్యేకించి ఒక వీడియోకు అందుబాటులో ఉన్న ఫార్మేట్‌లను తెలియజేస్తుంది. కావాల్సిన రీతిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తదుపరి అదే డెస్క్‌టాప్‌ లేదంటే ల్యాప్‌టాప్‌ కంప్యూటర్‌లోకి తెచ్చుకోవచ్చు. దాన్నే తరవాతి దశలో స్మార్ట్‌ఫోన్‌లోకి పంపుకోవచ్చు. 


Updated Date - 2021-08-21T08:12:04+05:30 IST