దేశీయ మార్కెట్లోకి డజను ఔషధాలు

ABN , First Publish Date - 2021-06-20T09:24:34+05:30 IST

గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌ మహమ్మారి ప్రభావం దేశీయ అమ్మకాలపై ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఆశావహంగా ఉండగలదని నాట్కో ఫార్మా భావిస్తోంది. 2021-22లో దేశీయ మార్కెట్లోకి 10-12 ఔషధాల ను విడుదల చేయాలని యోచిస్తోంది. అగ్రోకెమికల్స్‌ విభాగంలో

దేశీయ మార్కెట్లోకి డజను ఔషధాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌ మహమ్మారి ప్రభావం దేశీయ అమ్మకాలపై ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఆశావహంగా ఉండగలదని నాట్కో ఫార్మా భావిస్తోంది. 2021-22లో దేశీయ మార్కెట్లోకి 10-12 ఔషధాల ను విడుదల చేయాలని యోచిస్తోంది. అగ్రోకెమికల్స్‌ విభాగంలో  రెండు ఉత్పత్తులు కూడా ఆదాయాన్ని పెంచగలవని అంచ నా వేస్తోంది. అమెరికా మార్కెట్లోకి 7-8 ఔషధాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో కేన్సర్‌ చికిత్సకు వినియోగించే ఎవిరోలిమస్‌ వంటి తక్కువ పోటీ ఉన్న ఔషధాలు ఉన్నాయి. అమెరికాలో అధిక విలువ కలిగిన  ఔషధాలు, దేశీయ మార్కెట్లోకి 10-12 ఉత్పత్తులను విడుదల చేయడం వంటి సానుకూల అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధికి దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది. కంపెనీ వ్యూహానికి, వృద్ధికి అనుకూలంగా ఉండే కంపెనీలు, ఔషధాలను కొనుగోలు చేయడంపై కూడా నాట్కో దృష్టి పెట్టింది. దేశీయ మార్కెట్లో కేన్సర్‌ ఔషధాల విభాగంలో నాట్కో అగ్రగామిగా ఉంది. ఈ విభాగంలో దాదాపు 33 ఔషధాలను విక్రయిస్తోంది. గుండె జబ్బులు, మధుమేహం విభాగాల్లో కొత్త ఔషధాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతోంది.

Updated Date - 2021-06-20T09:24:34+05:30 IST