పథకాల అమల్లో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-01-17T04:34:13+05:30 IST

పథకాల అమల్లో అలసత్వం వద్దు

పథకాల అమల్లో అలసత్వం వద్దు
నర్సరీని పరిశీలిస్తున్న అమృత

  • జిల్లా పంచాయతీ అధికారి అమృత 

ఆమనగల్లు: ప్రభుత్వ పథకాల అమల్లో అలసత్వానికి తావు ఇవ్వొద్దని జిల్లా పంచాయతీ అధికారి అమృత అన్నారు. హరితహారం లక్ష్యం పూర్తికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఆమె కోరారు. తలకొండపల్లి మండలం చెన్నారంలో శనివారం ఆమె పర్యటించారు. ఎంపీడీవో రాఘవులు, ఎంపీవో రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ స్వప్నభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ వందనశ్రీనివా్‌సరెడ్డితో కలిసి హరితహారం, నర్సరీ, డంపింగ్‌యార్డ్‌, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం తదితర పనులను పరిశలీంచారు. పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 10వేల మొక్కలు పెంచుతున్నట్లు అమృత తెలిపారు. వర్షాకాలం నాటికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈ విద్యాసాగర్‌, ఈసీ కృష్ణ, రమే్‌షనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T04:34:13+05:30 IST