సత్ఫలితాలు ఇస్తోన్న బాపట్ల జీడిమామిడి

ABN , First Publish Date - 2021-07-30T06:04:21+05:30 IST

బాపట్ల పరిశోధనా స్థానం రూపొందించిన జీడిమామిడి రకాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్లు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ కోస్టల్‌జోన్‌-2 రీసెర్చ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.ధనుంజయరావు తెలిపారు

సత్ఫలితాలు ఇస్తోన్న బాపట్ల జీడిమామిడి
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ ధనుంజయరావు

రైతులు విస్తారంగా సాగు చేపట్టాలి : డాక్టర్‌ ధనుంజయరావు 

బాపట్ల, జూలై 29: బాపట్ల పరిశోధనా స్థానం రూపొందించిన జీడిమామిడి రకాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్లు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ కోస్టల్‌జోన్‌-2 రీసెర్చ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.ధనుంజయరావు తెలిపారు. పరిశోధన స్థానంలో గురువారం శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ బి.నాగేంద్రరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ బాపట్ల పరిశోధనస్థానం నుంచి 10 రకాలను రూపొందించినట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతులు వీటిని విస్తారంగా సాగు చేస్తున్నారన్నారు. విత్తన సైజు బాగుండే బీపీటీ 10, 11 రకాల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. దేశంలో 50 శాతం మాత్రమే  పండిస్తున్నారని, మిగిలిన 50 శాతాన్ని ఆఫ్రికన్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. దీని వల్ల ప్రతిఏడాది 8నుంచి 10వేల కోట్లరూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నామన్నారు. కాబట్టి రైతులు జీడిమామిడి సాగు చేసేందుకు ముందుకురావాలన్నారు. మనకు 200 నుంచి 300 ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉన్నాయి కాబట్టి ఎంత ఎక్కువ పంటలు పండించిన ప్రాసెసింగ్‌ చేసుకోవచ్చు అన్నారు.  బాపట్ల కేంద్రంలో ప్రతి ఏడాది 34 వేల మొక్కలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.  

 

Updated Date - 2021-07-30T06:04:21+05:30 IST