‘ఎవిగాన్‌’పై ఫుజిఫిలిమ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-07-02T06:00:23+05:30 IST

‘ఎవిగాన్‌’ బ్రాండ్‌తో జపాన్‌లో విక్రయిస్తున్న ఫావిపిరావిర్‌ టాబ్లెట్లు తయారు చేసి, విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

‘ఎవిగాన్‌’పై ఫుజిఫిలిమ్‌తో  డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  ‘ఎవిగాన్‌’ బ్రాండ్‌తో జపాన్‌లో విక్రయిస్తున్న ఫావిపిరావిర్‌ టాబ్లెట్లు తయారు చేసి, విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  కొవిడ్‌-19 చికిత్సలో ఉపయోగిస్తున్న ఫావిపిరావిర్‌ జనరిక్‌ అభివృది,్ధ  ‘ఎవిగాన్‌’ టాబ్లెట్ల తయారీ, విక్రయానికి  ఫుజిఫిలిమ్‌ కార్పొరేషన్‌కు చెందిన ఫుజిఫిలిమ్‌ టొయమా కెమికల్‌ కంపెనీ, గ్లోబల్‌ రెస్పాన్స్‌ ఎయిడ్‌ (జీఆర్‌ఏ)తో త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీ స్‌ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎవిగాన్‌ తయారీకి డాక్టర్‌ రెడ్డీ్‌సకు ఫుజిఫిలిమ్‌ ప్రత్యేక హక్కులు ఇచ్చింది. వీటిని జపాన్‌, చైనా, రష్యా మినహా మిగిలిన అన్ని దేశాల్లో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌, జీఆర్‌ఏలను ఫుజిఫిలిమ్‌ అనుమతించింది. భారత్‌లో పంపిణీ, విక్రయానికి డాక్టర్‌ రెడ్డీ్‌సకు మాత్రమే వీలుంటుంది. 

Updated Date - 2020-07-02T06:00:23+05:30 IST