స్పుత్నిక్‌ లైట్‌ ఆమోదానికి డాక్టర్‌ రెడ్డీస్‌ రెండు వారాల్లో దరఖాస్తు!

ABN , First Publish Date - 2021-06-01T06:03:33+05:30 IST

సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ లైట్‌కు అనుమతి కోసం వచ్చే రెండు వారాల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దరఖాస్తు చేసే వీలుంది. దేశీయంగా ఈ టీకాను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో...

స్పుత్నిక్‌ లైట్‌ ఆమోదానికి డాక్టర్‌ రెడ్డీస్‌ రెండు వారాల్లో దరఖాస్తు!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ లైట్‌కు అనుమతి కోసం వచ్చే రెండు వారాల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దరఖాస్తు చేసే వీలుంది. దేశీయంగా ఈ టీకాను ప్రవేశపెట్టడానికి  ప్రభుత్వంతో కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశంలో సింగిల్‌ డోస్‌ టీకాను వేగంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని.. భారత్‌లో దీన్ని తయారు చేయనున్న కంపెనీలు త్వరగా దరఖాస్తులు దాఖలు చేయాలని, ఆమోదం పొందే ప్రక్రియను వేగిరం చేయాలని ప్రభుత్వం కోరినట్లు చెబుతున్నారు. ఈ నెల మధ్య నాటికి దీన్ని విడుదల చేయాలని డాక్టర్‌ రెడ్డీస్‌ భావిస్తోంది. 


Updated Date - 2021-06-01T06:03:33+05:30 IST