అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కేన్సర్‌ ఔషధం

ABN , First Publish Date - 2021-10-20T07:57:04+05:30 IST

కేన్సర్‌ చికిత్సలో వినియోగించే డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఔషధానికి యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదం తెలిపింది.

అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కేన్సర్‌ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కేన్సర్‌ చికిత్సలో వినియోగించే డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఔషధానికి యూఎ్‌సఎ్‌ఫడీఏ ఆమోదం తెలిపింది. మల్టిపుల్‌ మైలోమా, మైలోడై్‌సప్లాస్టిక్‌ సిండ్రోమ్స్‌ చికిత్సకు వినియోగించే లెనలిడోమైడ్‌ టాబ్లెట్లను అమెరికాలో విక్రయించేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చిందని వెల్లడించింది. 2.5 ఎంజీ, 20 ఎంజీ మోతాదులకు తుది అనుమతి, 5, 10, 15, 25 ఎంజీ టాబ్లెట్లకు తాత్కాలిక అనుమతి లభించింది. 2.5, 20 ఎంజీ టాబ్లెట్లకు180 రోజుల పాటు ఎక్స్‌క్లూజివ్‌ హక్కులు ఉంటాయి. ‘రెవ్లీమిడ్‌’ బ్రాండ్‌తో లెనలిడోమైడ్‌ టాబ్లెట్లను సెల్జీన్‌ విక్రయిస్తోంది. 

Updated Date - 2021-10-20T07:57:04+05:30 IST